Share News

వేసవిలో చెమటకాయలు వేధిస్తున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండి!

ABN , Publish Date - Apr 01 , 2026 | 04:33 PM

ఎండలు పెరుగుతున్న కొద్దీ చాలా మందిని వేధించే ప్రధాన సమస్య చెమటకాయలు. చర్మ రంధ్రాలు పూడుకుపోయి చెమట బయటకు రానప్పుడు చెమటకాయలు ఏర్పడతాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే అవి ఇట్టే మాయమవుతాయి.

వేసవిలో చెమటకాయలు వేధిస్తున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండి!
Heat Rash Home Remedies

ఇంటర్నెట్ డెస్క్: ఎండలు పెరుగుతున్న కొద్దీ చాలామందిని వేధించే ప్రధాన సమస్య చెమటకాయలు. చర్మ రంధ్రాలు పూడుకుపోయి చెమట బయటకు రానప్పుడు చెమటకాయలు(Heat Rash) ఏర్పడతాయి. పెద్దలతో పాటు పిల్లల్నీ ఈ సమస్య తెగ ఇబ్బంది పెడుతుంది. చెమటకాయల వల్ల కలిగే దురద, మంట నుంచి ఉపశమనం పొందడానికి ఈ కింది చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.


చెమటకాయల నివరాణకు ఇంటి చిట్కాలు:

  • గంధం పొడిలో కొద్దిగా పన్నీరు కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇది చర్మాన్ని చల్లబరిచి, మంటను తగ్గిస్తుంది.

  • ముల్తానా మట్టిలో నీళ్లు కలిపి చెమటకాయలు ఉన్నచోట రాసి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది చర్మంపై ఉన్న అధిక నూనెను, మురికిని తొలగిస్తుంది.

  • కలబంద జెల్‌ను నేరుగా చెమటకాయలపై రాస్తే అందులోని యాంటీసెప్టిక్ గుణాలు చర్మాన్ని త్వరగా కోలుకునేలా చేస్తాయి.

  • వేప ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటితో స్నానం చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. లేదా వేపాకుల పేస్ట్‌ను కూడా చెమటకాయలు ఉన్న చోట రాసుకుంటే తగ్గుతాయి.

  • ఒక కాటన్ క్లాత్ లో ఐస్ ముక్కలను చుట్టి చెమటకాయల మీద మెల్లగా రుద్దాలి. ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • వేసవిలో సాధ్యమైనంత వరకు వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి. సింథటిక్ దుస్తులు చెమటను పీల్చుకోలేవు, దీనివల్ల సమస్య మరింత పెరుగుతుంది.

  • రోజుకు రెండుసార్లు చల్లని నీటితో స్నానం చేయడం చాలా మంచింది. యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ వాడటం వల్ల చర్మం శుభ్రంగా ఉంటుంది.

  • శరీరంలో వేడి తగ్గడానికి ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలి.

  • కెమికల్స్ ఎక్కువగా ఉండే సెంటెడ్ పౌడర్లకు దూరంగా ఉండాలి. అవసరమైతే డాక్టర్ సూచించిన మెడికేటెడ్ కూలింగ్ పౌడర్స్‌ను వాడొచ్చు.

  • ఒకవేళ చెమటకాయలు ఎర్రగా వాచి, చీము పట్టినట్లు అనిపిస్తే సొంత ప్రయోగాలు చేయకుండా చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Health News

Updated Date - Apr 01 , 2026 | 04:48 PM