శ్వేత విప్లవంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆదర్శం: చినజీయర్ స్వామి
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:58 PM
శ్వేత విప్లవంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆదర్శంగా నిలిచిందని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు.
కృష్ణాజిల్లా, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): శ్వేతవిప్లవంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆదర్శంగా నిలిచిందని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) వ్యాఖ్యానించారు. కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ మరో హరిత విప్లవం తీసుకురాబోతోందని చెప్పుకొచ్చారు. డెయిరీ, ఆగ్రో కార్యక్రమాలని రెండింటినీ కృష్ణా మిల్క్ యూనియన్ సమ్మిళితం చేయబోతోందని వివరించారు. మన ప్రాంతాల్లో పండిన పంటలకు సరైన ధర వచ్చేలా చేసే బాధ్యతను కృష్ణా మిల్క్ యూనియన్ తీసుకుంటుందని తెలిపారు.

ఇది ఇతరులకు ఆదర్శం కావాలని చినజీయర్ స్వామి మార్గనిర్దేశం చేశారు. కృష్ణాజిల్లాలోని వీరవల్లిలో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో గురువారం సుఫల రైతు యాత్ర కార్యక్రమం జరిగింది. వీరవల్లి కృష్ణ మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో చినజీయర్ స్వామి ముఖాముఖి నిర్వహించారు. మన నెల, మన ఆరోగ్యం, భూ పరిరక్షణ, ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సేంద్రీయ పద్ధతుల ద్వారా జన ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం గురించి వివరించారు. ఈ సందర్భంగా సేంద్రీయ వ్యవసాయ సాగుదారులతో చినజీయర్ స్వామి ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా చినజీయర్ స్వామి ప్రసంగించారు. ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించే రైతులకు కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు సహకరిస్తున్నారని తెలిపారు. జాతీయ పాడి రైతు అభివృద్ధి సంస్థ సహకారం అవసరమని చెప్పుకొచ్చారు. ఎరువులు, పురుగుల మందులు వాడకుండా ఆయా పంటలను పండించాలని సూచించారు. ఈ పంటలకు మార్కెటింగ్ భరోసాను కృష్ణ మిల్క్ యూనియన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని.. ఇలాంటి భరోసా ప్రభుత్వాలు కూడా ఇవ్వాలని కోరారు. ఇందువల్ల కొంత ఇబ్బంది ఉంటుందని అన్నారు. పంట నాణ్యత ఆధారంగానే విలువ ఉంటుందని.. మంచి ధర వస్తుందని తెలిపారు. కృష్ణా జిల్లాలో ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం ఇతర చోట్లకు ఆదర్శంగా నిలుస్తుందని చినజీయర్ స్వామి పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. అసెంబ్లీ సభ్యులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
ఏపీ అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం
Read Latest Telangana News And AP News And Telugu News