అంబటి రాంబాబుపై పీటీ వారెంట్.. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:15 PM
సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా వివాదంలో వైసీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. జనసేన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పీటీ వారెంట్ కారణంగా ఈ చర్య తీసుకున్నారు.
గుంటూరు, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంక్రాంతి లక్కీ డ్రా కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు (Ambati Rambabu) చట్టపరమైన ఇబ్బందులు తప్పలేదు. సత్తెనపల్లి పోలీసులు గురువారం ఆయనను గుంటూరులోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2023 సంక్రాంతి పండుగ సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో బలవంతంగా ప్రజలకు టికెట్లు అంటగట్టారని జనసేన నేతలు ఆరోపించారు.
ప్రజలను బెదిరించి టికెట్లు కొనిపించారని, ఇది చట్టవిరుద్ధమని జనసేన నేతలు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సత్తెనపల్లి పోలీసులు గురువారం ఆయనని గుంటూరులోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. అంబటిపై ఉన్న పీటీ వారెంట్ కారణంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. కోర్టులో ఆయనని హాజరుపరచడంతో.. ఈ కేసులో విచారణ వేగవంతం కానుంది. ఈ కేసుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. అసెంబ్లీ సభ్యులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
ఏపీ అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం
Read Latest Telangana News And AP News And Telugu News