Betting Apps Promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ స్టార్స్.. రంగంలోకి ఈడీ..
ABN, Publish Date - Jul 11 , 2025 | 11:05 AM
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటరై మొత్తం 29 మంది సినీ సెలెబ్రిటీలపై కేసు నమోదు చేసింది.
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ఎంటరైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కాసులు వెనకేసుకున్న సెలబ్రిటీల బరతం పట్టేందుకు ఈడీ సిద్ధం అయింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మొత్తం 29 మందిపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖిలతోపాటు పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు అయ్యాయి.
ఈ వీడియోలను వీక్షించండి..
కాపాడుకోలేమా..? యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jul 11 , 2025 | 11:25 AM