ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు క్లోజ్
ABN , Publish Date - Apr 18 , 2025 | 09:45 AM
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల్లో వేగం పెరిగింది. అభివృద్ధి పనుల్లో భాగంగా మూడు నెలల పాటు ప్లాట్‌ఫాంలను తాత్కాలికంగా మూసివేస్తునట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల్లో వేగం పెరిగింది. అభివృద్ధి పనుల్లో భాగంగా మూడు నెలల పాటు ఫ్లాట్‌ఫాంలను తాత్కాలికంగా మూసివేస్తునట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కొనసాగుతున్న పునరాభివృద్ధి పనుల దృష్ట్యా 60 రైళ్లను ఇతర టెర్మినల్‌ల నుంచి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. నిర్మాణ పనుల నేపథ్యంలో 5.6 ఫ్లాట్ ఫామ్‌లను మూసివేసి 63 రోజుల పాటు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఆ తర్వాత దశల వారీగా ఇతర ఫ్లాట్ ఫామ్‌లను మూసివేయనున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పున: నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ వంతెనల పనులు ప్రారంభిస్తుండటంతో 115 రోజుల పాటు సగం ఫ్లాట్ ఫామ్‌లు మూసివేయనున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి దశలవారీగా 60కి పైగా రైళ్లను దారి మళ్లించి వేరే స్టేషన్‌ల నుంచి తిప్పనున్నారు. వీటిలో సింహభాగం రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి రాకపోకలు కొనసాగించనుండగా, మరికొన్ని నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి నడుస్తాయని అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రీ డెవలప్‌మెంట్‌లో భాగంగా రెండంతస్తుల్లో భారీ స్కై కాంకోర్న్ ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో ఇదే కీలక భాగం. ఇది ఏకంగా 1.10 మీటర్ల వెడల్పు 120 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రయాణికులకు అన్ని వసతులు ఇక్కడే ఉంటాయి. వేచి ఉండే ప్రాంతంతో పాటు రీటైల్ అవుట్ లేట్స్, రెస్టారెంట్లు, తదితర సౌకర్యాలు అన్ని ఇందులోనే ఏర్పాటు చేస్తున్నారు. లిఫ్ట్‌లు ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ వంతెనలో అనుసంధానమై ఉంటాయి.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి
TDP Poll Push: టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కమిటీ
HIgh Court: Order: కరువు మండలాల స్కూళ్లలో మిడ్ డే మీల్స్‌పై వివరాలివ్వండి
Pawan Kalyan: వికసిత్ భారత్ లక్ష్యసాధనలోగ్రామీణాంధ్ర కీలకం
Read Latest AP News And Telugu News