మా నాన్న చనిపోయాడు..చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకున్న హరీష్‌రావు
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:28 PM
సిద్దిపేట పట్టణంలోని మెట్రో గార్డెన్‌లో స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో చిన్నారులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి బాధను విని మాజీ మంత్రి హరీష్‌రావు కంట కన్నీరు పెట్టుకున్నారు.
సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని మెట్రో గార్డెన్‌లో 'భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి' అనే అంశంపై స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు పాల్గొన్నారు. అవగాహన సదస్సులో తండ్రిని కోల్పోయి బిడ్డ చదువు కోసం తల్లి పడుతున్న కష్టాలను విద్యార్థులు పంచుకున్నారు.
తమ చదువు కోసం పేరెంట్స్ పడుతున్న కష్టాలను గుర్తించి, తాము తమ చదువు కోసం తపిస్తున్న పేరెంట్స్‌ను ఇబ్బంది పెడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయి, బిడ్డ చదువు కోసం తల్లి పడుతున్న కష్టాన్ని కంటతడి పెట్టుకుంటూ ఓ విద్యార్ధిని వెల్లడించింది. విద్యార్థిని వేదన విని హరీష్‌రావు కంటతడి పెట్టారు. ఆ విద్యార్థిని దగ్గరకు తీసుకుని హరీష్‌రావు ఓదార్చారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి
TTD Donation Management: గోవిందుడి ఖజానా మరింత భద్రం
Minister NMD Farooq: మైనార్టీలకిచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యం
Kasireddy Rajasekhar Reddy: ముందస్తు బెయిలివ్వండి అరెస్టు నుంచి కాపాడండి
Read Latest AP News And Telugu News
Updated at - Apr 19 , 2025 | 12:31 PM