గోల్కొండలో ఆషాఢ మాస బోనాల సందడి షురూ

ABN, Publish Date - Jun 27 , 2025 | 11:06 AM

Bonalu Festival 2025: భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక, ఎల్లమ్మ ఆలయంలో తొలి బోనంతో బోనాలు మొదలయ్యాయి.

హైదరాబాద్, జూన్ 27: ఆషాఢ మాస బోనాలు (Bonalu Festival) భాగ్యనగరంలో ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక, ఎల్లమ్మ ఆలయంలో తొలి బోనంతో బోనాల సందడి మొదలైంది. తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా గోల్కొండ జగదాంబిక మహంకాళి, ఎల్లమ్మ తల్లికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కవిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరిక

వైభవంగా ప్రారంభమైన బోనాలు.. కిక్కిరిసిన కోట

Read Latest Telangana News And Telugu News

Updated at - Jul 01 , 2025 | 11:13 AM