ABN Andhrajyothy: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్కీ డ్రా విజేతల ఎంపిక
ABN, Publish Date - Apr 09 , 2025 | 07:44 PM
ఆంధ్రజ్యోతి "కార్ అండ్ బైక్ రేస్" లక్కీడిప్‌లో నెల్లూరు సంతపేటకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి జొన్నాదుల కోటేశ్వరరావు కారు గెలుచుకున్నారు. కారు గెలుచుకోవడంతో పట్టరాని ఆనందంలో కోటేశ్వరరావు మునిగిపోయారు.
విజయవాడ: ఆంధ్రజ్యోతి "కార్ అండ్ బైక్ రేస్" లక్కీడ్రాలో విజేతలను బుధవారం నాడు ఎంపిక చేశారు. విజయవాడ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో జరిగిన లక్కీ డ్రాలో ముఖ్య అతిథిగా మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొని విజేతలను ఎంపిక చేశారు. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా నెల్లూరుకు చెందిన జొన్నాదుల కోటేశ్వరరావు గెలుచుకున్నారు. విజేతగా నిలిచిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి కోటేశ్వరరావు ఆంధ్రజ్యోతి పాఠకుడిగా ఉన్నారు. బహుమతి గెలుచుకున్న కోటేశ్వరరావుకు మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆంధ్రజ్యోతి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గత 23 ఏళ్లుగా నిర్వహిస్తుందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు.
ఆంధ్రజ్యోతి "కార్ అండ్ బైక్ రేస్" లక్కీడిప్‌లో నెల్లూరు సంతపేటకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి జొన్నాదుల కోటేశ్వరరావు కారు గెలుచుకున్నారు. కారు గెలుచుకోవడంతో పట్టరాని ఆనందంలో కోటేశ్వరరావు మునిగిపోయారు. ఈ సందర్భంగా కారు విజేత కోటేశ్వరరావు మాట్లాడారు. తన జీవితంలో సైకిల్ తప్పించి కనీసం బైకు కూడా కొనలేదని వెల్లడించారు. ఆంధ్రజ్యోతి లక్కీడిప్‌లో కారు గెలుచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తాను చేసిన మంచిపనులు, దేవుడికి చేసిన పూజలు ఫలించాయని తెలిపారు. ఆ దేవుడు ఆంధ్రజ్యోతి రూపంలో కారు వచ్చేలా చేశారని అన్నారు. నెల్లూరులో ఇకపై తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో తిరుగుతానని వెల్లడించారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఉద్యోగం నుంచి రిటైర్ అయిన 18 ఏళ్ల నుంచి ఆంధ్రజ్యోతి పత్రికనే చదువుతున్నానని చెప్పారు. ప్రతిరోజూ పత్రికలో ఒక్క అక్షరం వదలకుండా పూర్తిగా చదువుతున్నానని అన్నారు. తాము ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెల్‌నే వీక్షిస్తామని విజేత కోటేశ్వరరావు పేర్కొన్నారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వార్తలు కూడా చదవండి...
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు
Manchu Manoj: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..
Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత
Read Latest Telangana News And Telugu News
Updated at - Apr 09 , 2025 | 07:47 PM