పాకిస్తాన్ వాళ్ల కోసం వెతుకుతుంటే భారీగా బయటపడ్డ అక్రమ వలసదారులు
ABN, Publish Date - Apr 26 , 2025 | 12:05 PM
జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. అమాయకులైన పర్యాటకులు చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.
జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. అమాయకులైన పర్యాటకులు చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. వెంటనే అలర్ట్ అయి పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలతో కేంద్రహోంమత్రి అమిత్ షా మాట్లాడారు. ఆయా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
వివిధ రాష్ట్రాల్లో ఉండే పాకీస్తానీయులను వెంటనే వారి దేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో నిఘావర్గాలు జల్లెడ పట్టాయి. నిఘావర్గాల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అహ్మదాబాద్‌లో పోలీసులు సోదాలు చేయగా 400 వందల మంది అక్రమ వలస దారులు బయటపడ్డారు. భారత్‌లో అక్రమ చొరబాటుదారులను కేంద్ర ప్రభుత్వం ఏరివేస్తుంది. అహ్మదాబాద్‌లోని ఇషాన్‌పూర్‌లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. పోలీసుల అదుపులో వెయ్యి మందికి పైగా బంగ్లాదేశీయులు ఉన్నారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూాడా చదవండి...
Kaleshwaram: తుమ్మిడిహెట్టి నిర్మాణం 3 బ్యారేజీలు పునర్నిర్మాణం
Mahabubabad: మానుకోటలో ఏసీబీ దాడులు
CM Revanth Reddy: పీవోకేను భారత్‌లో కలిపేయండి
Read Latest Telangana News And Telugu News
Updated at - Apr 26 , 2025 | 01:02 PM