Share News

Social Media Threats: పెళ్లి చేయకుంటే నగ్న ఫొటోలు బయటపెడతా

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:47 AM

బాలికతో పెళ్లి వద్దన్నందుకు ఆమె నగ్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ ఆమె కుటుంబసభ్యులను ఓ యువకుడు బెదిరించాడు.

Social Media Threats: పెళ్లి చేయకుంటే నగ్న ఫొటోలు బయటపెడతా

  • బాలికతో పెళ్లి వద్దన్నందుకు కుటుంబసభ్యులకు ప్రియుడి బెదిరింపులు

  • మాట్లాడదామని పిలిచి.. కొట్టి చంపిన ఆమె అన్న, స్నేహితుడు.. మెదక్‌ జిల్లా మగ్ధుంపూర్‌లో ఘటన

తూప్రాన్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): బాలికతో పెళ్లి వద్దన్నందుకు ఆమె నగ్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ ఆమె కుటుంబసభ్యులను ఓ యువకుడు బెదిరించాడు. దాంతో ఆమె అన్న తన స్నేహితుడితో కలిసి అతడిని హత్య చేశాడు. ఈ ఘటన మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం మగ్ధుంపూర్‌ (దొంతి)లో జరిగింది. హైదరాబాద్‌ బోరబండకు చెందిన మహ్మద్‌ సాబిల్‌(21) ఓ బాలికను ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించగా, బాలిక కుటుంబసభ్యులు అంగీకరించలేదు. బాలికతో తనకు పెళ్లి చేయకపోతే ఆమెతో తాను సాన్నిహిత్యంగా కలిసి ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ ఆమె పెద్దనాన్న కుమారుడు సంగారెడ్డికి చెందిన సయ్యద్‌ అప్సర్‌కు ఫోన్‌ చేసి సాబిల్‌ బెదిరించాడు. ఫొటోలు డిలీట్‌ చేయాలని పలుమార్లు అప్సర్‌ కోరినా సాబిల్‌ వినలేదు.


అప్సర్‌ అతడి స్నేహితుడు పోతారెడ్డిపల్లికి చెందిన సారోల్ల సంతోష్‌.. మాట్లాడుకుందామని ఈ నెల 21న సాబిల్‌కు ఫోన్‌ చేసి పిలిచారు. అప్సర్‌ చెప్పిన చోటుకు సాబిల్‌ రాగానే అతడిని కారులో ఎక్కించుకుని శివ్వంపేట మండలం మగ్దుంపూర్‌ శివారుకు తీసుకెళ్లారు. అక్కడ మొబైల్‌లో ఉన్న ఫొటోలో తొలగించాలని కోరగా సాబిల్‌ అంగీకరించలేదు. పైగా ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరించాడు. దాంతో కోపోద్రిక్తులైన అప్సర్‌, సంతోష్‌.. సాబిల్‌ మొబైల్‌ను లాక్కొని అతడి గొంతు నులిమి పక్కనే ఉన్న ప్రీకాస్ట్‌ గోడకు తల బలంగా కొట్టారు. సాబిల్‌ స్పృహతప్పి పడిపోగా, బండరాయితో తలపై కొట్టి చంపేశారు. తర్వాత అతని ఒంటిపై ఉన్న దుస్తులు తొలగించి, అక్కడే పడేసి పారిపోయారు. గత సోమవారం రాత్రి ఈ ఘటన జరగ్గా మంగళవారం ఉదయం మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసుల అప్సర్‌, సంతోష్‌‌ను గురువారం అరెస్ట్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:47 AM