MLA: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం..
ABN , Publish Date - Feb 04 , 2025 | 08:44 AM
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం వెంగళరావునగర్ డివిజన్ మధురానగర్ డి-బ్లాక్ పార్కులో రూ.16 లక్షలతో పార్క్ పునర్ నిర్మాణం పనులకు, జి-బ్లాక్‌లో రూ.15.50 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

- జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Jubilee Hills MLA Maganti Gopinath) అన్నారు. సోమవారం వెంగళరావునగర్ డివిజన్ మధురానగర్ డి-బ్లాక్ పార్కులో రూ.16 లక్షలతో పార్క్ పునర్ నిర్మాణం పనులకు, జి-బ్లాక్‌లో రూ.15.50 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం(Jubilee Hills Constituency)లో కోట్లాది రూపాయలతో పలు అభివృద్థి కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Waterboard: ట్యాంకర్లను పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు..
మధురానగర్ కాలనీని ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్య, జీహెచ్‌ఎంసీ డీఈ రామచంద్ర రాజు, యూబిడి ఇన్స్పెక్టర్ విక్రమ్ చంద్ర, మధురానగర్ కాలనీ సంక్షేమ సమితి అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కోడె సాంబశివ రావు, కోశాధికారి సుగుణ, ఉపాధ్యక్షుడు మనోహర్ రావు, దర్శకుడు రేలంగి నరసింహారావు, పద్మావతి, విజయవాణి తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: KP Chowdary : నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: MLA Raj Gopal Reddy : మంత్రిని అడ్డుకున్నారన్న కేసు కొట్టివేయండి
ఈవార్తను కూడా చదవండి: Leopard: గ్రామ సింహం దెబ్బకు పరుగులు పెట్టిన చిరుత..
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..
Read Latest Telangana News and National News