Share News

Vande Bharat Express: వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:59 PM

విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్ పైకి ఎద్దు దూసుకెళ్లింది.

Vande Bharat Express: వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
Vande Bharat Express train

మహబూబాబాద్, జులై 07: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్ సమీప అప్ లైన్‌లో 428/11 వద్ద రైల్వే ట్రాక్‌పైకి వచ్చిన ఎద్దును వేగంగా వస్తున్న వందేభారత్ రైలు ఢీకొట్టింది. దీంతో కొన్ని నిమిషాలపాటు ట్రాక్‌పై ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది. ఈ ఘటనపై సమీపంలోని రైల్వే స్టేషన్ అధికారులకు వందేభారత్ సిబ్బంది సమాచారం అందించారు. దీంతో అధికారులతోపాటు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ట్రాక్‌పై ఉన్న ఎద్దును తొలగించారు.


అయితే ఈ ఘటనలో రైలు ఇంజన్ ముందు భాగం విరిగిపోయింది. ఆ తర్వాత రైలు సికింద్రాబాద్‌కు బయలుదేరింది. రైల్వే ట్రాక్‌పై వందేభారత్ నిలిచిపోవడంతో.. ఆ ట్రాక్‌పై వెళ్లే రైళ్లను కొద్దిసేపు నిలిపివేశారు. ఈ సమయంలో వందేభారత్‌లోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మరోవైపు ఈ ఎద్దు యజమాని కోసం రైల్వే అధికారులు గాలిస్తున్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు స్టేషన్ అధికారులు చెప్పారు.


మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాపట్ల జిల్లా చీరాల ఫైర్ అఫీస్ గేటు వద్ద మరో వందే భారత్ రైలు నిలిచిపోయింది. ఆదివారం నాడు ఓ కుక్కని వందే భారత్ రైలు ఢీకొట్టింది. అనంతరం ఎయిర్ బ్రేక్ పట్టేసింది. దీంతో రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి.. మరమ్మతులు చేపట్టారు. రైలు నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈ వార్తలు కూడా చదవండి

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం

డిజిటల్‌ అరెస్టు పేరుతో.. వృద్ధుడికి రూ.53 లక్షల కుచ్చుటోపీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 06 , 2025 | 07:31 PM