Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అసలు కారణం ఏమిటంటే
ABN , Publish Date - Apr 04 , 2025 | 07:48 AM
ఈనెల 6వతేదీ ఆదివారం నగరంలోని ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియంలో ఐపీల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు

హైదరాబాద్ సిటీ: ఐపీల్ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) పరిసరాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 6నఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ - గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. మ్యాచ్ సమయలో చెంగిచెర్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ(Chengicherla, Boduppal, Peerjadiguda), ఎల్‌బీనగర్, నాగోల్, తార్నాక, రామాంతపూర్ వైపు నుంచి ఉప్పల్ స్టేడియం వైపునకు భారీ వాహనాలను అనుమతించని రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudheer Babu) ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: దారుణం.. ఇటుకలతో మోది బాలుడి హత్య
ఈ వార్తలు కూడా చదవండి:
2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్!
మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్ జైలుకే!
రెయిన్ అలర్ట్.. మరో రెండు గంటలపాటు..
Read Latest Telangana News and National News