Share News

RRR Project: ఆర్‌ఆర్‌ఆర్‌ పనులను వేగిరం చేయండి

ABN , Publish Date - Feb 14 , 2025 | 04:04 AM

రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

RRR Project: ఆర్‌ఆర్‌ఆర్‌ పనులను వేగిరం చేయండి

  • అధికారులకు భట్టి, కోమటిరెడ్డి, పొన్నం ఆదేశాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్‌ అండ్‌ బీ శాఖ బడ్జెట్‌ ముందస్తు సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. ఆర్‌ అండ్‌ బీ శాఖకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆస్తులపై నివేదిక రూపొందించాలని, ఈ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలని భట్టి, కోమటిరెడ్డి ఆదేశించారు. హెచ్‌ఏఎం(హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌) చేపడుతున్న రహదారుల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.


రోడ్డు పనుల్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం నిబంధనలను పాటించాలని సూచించారు. గ. అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల అద్దె బకాయిలను వెంటనే చెల్లిస్తామని, దీనికి సంబంధించిన బిల్లులను పంపించాలని భట్టి అధికారులను ఆదేశించారు. బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి బీసీ సంక్షేమం, రవాణా శాఖల బడ్జెట్‌ ముందస్తు సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి, పొన్నం మాట్లాడారు. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల భవనాలకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. వీటికి అవసరమైన ప్రతిపాదనలను పంపిస్తే నిధులను మంజూరు చేస్తామని తెలిపారు.

Updated Date - Feb 14 , 2025 | 04:04 AM