TSPSC Group 2 Results : తెలంగాణ గ్రూప్-2 రిజల్ట్స్ వచ్చేశాయ్.. విడుదల చేసిన TSPSC చైర్మన్ బుర్రా వెంకటేశం..
ABN , Publish Date - Mar 11 , 2025 | 03:44 PM
Telanagna Group 2 Exam Results : తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు పరీక్ష ఫలితాలను tspsc.gov.in లో చూడవచ్చు. డైరెక్ట్ లింక్ ఇతర వివరాలు క్రింద ఉన్నాయి.

Telanagna Group 2 Exam Results : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) tspsc.gov.inలో గ్రూప్ 2 (Telangana Group 2 Results) ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. TSPSC చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. గతేడాది డిసెంబర్ 15,16 వ తేదీల్లో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తుది కీ, OMR, మాస్టర్ క్వశ్చన్ పేపర్లతో పాటు జనరల్ ర్యాంకింగ్‌ను కింద ఇచ్చిన లింక్‌ని www.tspsc.gov.in ఉపయోగించి జాబితాలో తనిఖీ చేసుకోండి.
గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి TSPSC నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 2.36 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ 2 టాపర్ కు అత్యధికంగా 447 మార్కులు వచ్చాయి. జనరల్ ర్యాంకులతో పాటు ఫైనల్ కీ కూడా విడుదలైంది. OMR షీట్స్‌ను అధికారిక వెబ్‌సైట్లో టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచింది.
గ్రూప్ 2 ఫలితాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..