Share News

భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..

ABN , Publish Date - Mar 08 , 2025 | 05:05 AM

రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల్లో ఒక అదనపు డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, 14మంది ఐపీఎ్‌సలు, ఇద్దరు నాన్‌ కేడర్‌ ఎస్పీలు ఉన్నారు.

భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..

  • 21 మందికి స్థానచలనం సీఐడీ ఐజీగా శ్రీనివాసులు

  • అదనపు డీజీ(పర్సనల్‌)గా అనిల్‌ కుమార్‌

హైదరాబాద్‌, మార్చి7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల్లో ఒక అదనపు డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, 14మంది ఐపీఎ్‌సలు, ఇద్దరు నాన్‌ కేడర్‌ ఎస్పీలు ఉన్నారు. ఈ సారి ఐపీఎస్‌ అధికారుల పనితీరు ఆధారంగా ఆచితూచి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరో వైపు పనిభారంతో సతమతమవుతున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు స్వల్ప ఊరట కలిగించేలా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అదనపు డీజీ పర్సనల్‌, లా అండ్‌ ఆర్డర్‌ విభాగాలను పర్యవేక్షిస్తున్న మహేష్‌ భగవత్‌కు పని భారం తగ్గిస్తూ.. అదనపు డీజీ పర్సనల్‌గా అనిల్‌ కుమార్‌ను నియమించింది. వాస్తవానికి అనిల్‌ కుమార్‌ ప్రస్తుతం ఎస్పీఎఫ్‌ డీజీగా కొనసాగుతున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అదనంగా ఎస్పీఎఫ్‌ బాధ్యతలు కూడా పర్యవేక్షించాలని ఆయన్ను ఆదేశించింది.

పేరు ప్రస్తుతం బదిలీ అయిన స్థానం

అనిల్‌కుమార్‌ ఎస్పీఎఫ్‌ డీజీ అదనపు డీజీ(పర్సనల్‌), ఎస్పీఎఫ్‌ డీజీగా

అదనపు బాధ్యతలు

ఎం.శ్రీనివాసులు రామగుండం సీపీ సీఐడీ ఐజీ

అంబర్‌ కిషోర్‌ ఝా వరంగల్‌ సీపీ రామగుండం సీపీ

సన్‌ప్రీత్‌ సింగ్‌ సూర్యాపేట ఎస్పీ వరంగల్‌ సీపీ

చేతన పెద్దపల్లి డీసీపీ మహిళా భద్రత విభాగం ఎస్పీ

సింధూశర్మ కామారెడ్డి ఎస్పీ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ

రాజేష్‌ చంద్ర యాదాద్రి డీసీపీ కామారెడ్డి ఎస్పీ

పి.సాయిచైతన్య యాంటీ నార్కోటిక్స్‌ ఎస్పీ నిజామాబాద్‌ సీపీ

గౌస్‌ అలం ఆదిలాబాద్‌ ఎస్పీ కరీంనగర్‌ సీపీ

అఖిల్‌ మహజన్‌ సిరిసిల్ల ఎస్పీ ఆదిలాబాద్‌ ఎస్పీ

చెన్నూరి రూపేష్‌ సంగారెడ్డి ఎస్పీ యాంటీ నార్కోటిక్స్‌ ఎస్పీ

అక్షాంశ్‌ యాదవ్‌ సెంట్రల్‌జోన్‌ డీసీపీ భువనగిరి డీసీపీ

పరితోష్‌ పంకజ్‌ కొత్తగూడెం ఓఎస్డీ సంగారెడ్డి ఎస్పీ

జి.మహేశ్‌ బాబాసాహెబ్‌ ములుగు ఓఎస్డీ సిరిసిల్ల ఎస్పీ

అంకిత్‌ కుమార్‌ వెయిటింగ్‌ వరంగల్‌ ఈస్ట్‌ డీసీపీ

ఎ.భాస్కర్‌ వెయిటింగ్‌ మంచిర్యాల డీసీపీ

కె.నర్సింహ వెయిటింగ్‌ సూర్యాపేట ఎస్పీ

కే.శిల్పవల్లి వెయిటింగ్‌ సెంట్రల్‌జోన్‌ డీసీపీ

వై.సాయి శేఖర్‌ వెయిటింగ్‌ ఎస్‌ఐబీ ఎస్పీ

పి.కరుణాకర్‌ వెయిటింగ్‌ పెద్దపల్లి డీసీపీ

పి.రవీందర్‌ వరంగల్‌ ఈస్ట్‌ డీసీపీ సీఐడీ ఎస్పీ


ఇవి కూడా చదవండి...

CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 08 , 2025 | 08:51 AM