Share News

10th Supplementary Results: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్..

ABN , Publish Date - Jun 27 , 2025 | 05:20 PM

తెలంగాణకు సంబంధించిన పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 38,741 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా.. అందులో 24,415 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది.

10th Supplementary Results: పదో తరగతి  సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్..

తెలంగాణకు సంబంధించిన పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు (10th Supplementary Results) విడుదలయ్యాయి. ఈ ఏడాది 38,741 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా.. అందులో 24,415 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ పరీక్షలను జూన్ 2 నుంచి 13 వ తేదీ వరకూ నిర్వహించారు. తెలగాణలో ఈ ఏడాది మొత్తం 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల కోసం.. bse.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ క్రింది విధంగా చేయండి.


  • ముందుగా bse.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

  • అందులో TS SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయండి.

  • లాగిన్ అయ్యే ముందు మీ వివరాలను నమోదు చేయండి.

  • ఆ తర్వాత స్ర్కీన్‌పై డిస్‌ప్లే అయిన మీ ఫలితాలను చెక్ చేసుకోండి.

  • ఫైనల్‌గా ఆ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటూ ప్రింట్ తీసుకోండి.


ఇవి కూడా చదవండి

ఫోన్ ట్యాపింగ్.. రోజుకొకరి విచారణ.. ఇదేమన్న డైలీ సీరియలా: ఎంపీ రఘునందన్

బేసిన్‌కు బాసిన్‌కు తేడా తెలియని సీఎం రేవంత్.. హరీష్ ఎద్దేవా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 27 , 2025 | 05:23 PM