Share News

CS Shanthikumari: ట్యాంక్‌ బండ్‌పై ‘స్కైవాక్‌’ చేపట్టండి

ABN , Publish Date - Feb 11 , 2025 | 06:39 AM

ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్‌ పరిసర ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే సందర్శకుల కోసం ‘స్కైవాక్‌’ లాంటి ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Shanthi kumari) అధికారులకు సూచించారు.

CS Shanthikumari: ట్యాంక్‌ బండ్‌పై ‘స్కైవాక్‌’ చేపట్టండి

- సీఎస్‌ శాంతికుమారి

హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్‌ పరిసర ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే సందర్శకుల కోసం ‘స్కైవాక్‌’ లాంటి ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Shanthi kumari) అధికారులకు సూచించారు. ప్రభుత్వం చేపట్టనున్న నూతన టూరిజం పాలసీ-2025(Tourism Policy-2025)పై సంబంధిత అధికారులతో సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ వార్తను కూడా చదవండి: Nizamabad: డ్యూటీలు ఎగ్గొట్టి బర్త్ డే పార్టీలు.. ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం..


city1.2.jpg

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. రాష్ట్రంలో ఎకో, టెంపుల్‌, హెల్త్‌ టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని తద్వారా పర్యాటకుల సంఖ్యను భారీ ఎత్తున ఆకర్షించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించిన ప్రదేశాలను, వారసత్వ కట్టడాలను గుర్తించి ప్రభుత్వం చేపట్టనున్న నూతన టూరిజం పాలసీలో పొందుపర్చాలని ఆదేశించారు.


ఈవార్తను కూడా చదవండి: Kavitha: కేసీఆర్‌ పాలన ఐఫోన్‌లా.. రేవంత్‌ పాలన చైనా ఫోన్‌లా ఉంది

ఈవార్తను కూడా చదవండి: RMP: మా సమస్యలపై బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 11 , 2025 | 06:39 AM