Share News

Special trains: ఉర్సు యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Jun 26 , 2025 | 08:05 AM

వాడి జంక్షన్‌ సమీపం హల్కట్టా షరీఫ్‌ వద్ద జరిగే ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యే యాత్రికుల కోసం జూలై 9, 11 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Special trains: ఉర్సు యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: వాడి జంక్షన్‌ సమీపం హల్కట్టా షరీఫ్‌ వద్ద జరిగే ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యే యాత్రికుల కోసం జూలై 9, 11 తేదీల్లో హైదరాబాద్‌(Hyderabad) నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. జూలై 9న హైదరాబాద్‌- నుంచి (07175) ప్రత్యేక రైలు 9.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం14.30 గంటలకు వాడికి చేరుకుంటుందని పేర్కొన్నారు.


అదేరోజు సాయంత్రం 4 గంటలకు వాడినుంచి (07176) బయలదేరి రాత్రి 9 గంటలకు తిరిగి హైదరాబాద్‌ కు చేరుకుంటుందని వివరించారు. అలాగే జూలై 11న హైదరాబాద్‌ నుంచి (07177) 5 గంటలకు బయలుదేరి 10 గంటలకు వాడికి చేరుకుంటుందని, తిరిగి వాడి నుంచి (07178) 11.35 గంటలకు బయలుదేరి సాయంత్రం 16.35 గంటలకు తిరిగి హైదరాబాద్‌(Hyderabad)కు చేరుకుంటుందని పేర్కొన్నారు.


city3.2.jpg

ఈ ప్రత్యేక రైళ్లు వచ్చి వెళ్లేప్పుడు బేగంపేట, సనత్‌నగర్‌, హఫీజ్‌పేట, లింగంపల్లి, నాగులపల్లి, శంకర్‌పల్లి, గుల్లగూడ, వికారాబాద్‌(Vikarabad), గోడంగూర, ధారూర్‌, రుక్మాపూర్‌, తాండూరు, మంతట్టి, నవాంద్‌గీ, కురగుంట, సీరం, మల్‌ఖైద్‌ రోడ్‌, చిత్తాపూర్‌ స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

వావ్.. మళ్లీ తగ్గిన తగ్గిన బంగారం, వెండి ధరలు

ఆరోగ్యశ్రీ మాటున మోసం చేస్తే కఠిన చర్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 26 , 2025 | 08:05 AM