Home » Vikarabad
వికారాబాద్‌లో ఒంటరి మహిళ దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆస్తి తగాదాలు ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. కన్న తండ్రి, పినతల్లి అనే కనికరం లేకుండా సొంత కుటుంబంపైనే పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉదంతంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు.
వికారాబాద్ ఆర్టీసీ డిపోలో సోమవారం అద్దె బస్సుల సర్వీసులు నిలిచాయి. డిపో మేనేజర్ వైఖరికి నిరసనగా హైర్ బస్సుల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరిస్తేనే అద్దె బస్సులు బయటకు తీస్తామని తేల్చి చెప్పారు.
పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి నాయకత్వ లోపం ఏర్పడింది. దేశంలో ఆ పార్టీకి అనుకూల పవనాలున్నా పరిగిలో మాత్రం పార్టీని నడిపే నాయకుడు లేకుండా పోయాడు.
కొడంగల్ ప్రాంత సమగ్ర అభివృద్ధిలో భాగంగా డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డివిజన్ ఏర్పాటుతో వెనకబడిన కొడంగల్ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది.
డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. మార్షల్ ఆర్ట్స్ చేస్తూ డీసీసీ అధ్యక్షులకు క్లాస్ చెప్పారు. కాంగ్రెస్ ఐడియాలజీపై పాఠాలు చెప్పారు రాహుల్.
పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని ఆయన అన్నారు.
హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరికి రానున్నారు. తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.