యువకుడిపై పోలీసుల థర్డ్ డిగ్రీ

ABN, Publish Date - Nov 17 , 2025 | 04:28 PM

ఓ యువకుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో అస్వస్థతకు గురైన యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వికారాబాద్, నవంబర్ 17: జిల్లాలోని పెద్దెముల్‌లో పోలీసులు ఓ యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. మంబాపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ అనే వ్యక్తిని ఎస్సై వేణుకుమార్ పోలీస్‌స్టేషన్‌లో చితకబాదారు. గౌస్ అనే వ్యక్తి రెండు నెలల క్రితం అనుమానాస్పదంగా మృతిచెందాడు. అయితే మృతుడి రిపోర్ట్స్‌ వచ్చాయంటూ అల్లుడైన ఫిరోజ్‌కు పోలీసులు ఫోన్ చేసి పిలిచారు. పోలీసులు ఫిరోజ్‌ను లోపలకు తీసుకెళ్లి కాళ్లు, చేతులపై 40 నిమిషాల పాటు కొట్టారు. పోలీసుల దెబ్బలకు ఫిరోజ్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో పోలీసులే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


ఇవి కూడా చదవండి

కొంపల్లి ఫ్లైఓవర్ ఆలస్యంపై ఎంపీ సీరియస్

సింగరేణి సీఎండీ ఆఫీస్ ముట్టడికి కవిత పిలుపు

Read Latest Telangana News And Telugu News

Updated at - Nov 17 , 2025 | 04:30 PM