Share News

Daughter Wedding Tragedy: తీవ్ర విషాదం.. కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహం..

ABN , Publish Date - Nov 23 , 2025 | 05:32 PM

కూతురి పెళ్లి రోజే ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి కోసం సరుకులు తేవడానికి వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. కూతురి పెళ్లి కోసం వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహాన్ని ఉంచటం అందర్నీ కలిచి వేస్తోంది.

Daughter Wedding Tragedy: తీవ్ర విషాదం.. కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహం..
Daughter Wedding Tragedy

పచ్చని పెళ్లి పందిరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురిని మెట్టినింటికి పంపాల్సిన ఓ తండ్రి కాటికి చేరాడు. కూతురి పెళ్లి కోసం సరుకులు తీసుకురావడానికి వెళ్లిన ఆయన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సగెంకుర్దు గ్రామానికి చెందిన అనంతప్ప కూతురు అవంతికకు ఇటీవలే పెళ్లి కుదిరింది. ఈ రోజు (ఆదివారం) అవంతిక పెళ్లి జరగాల్సి ఉంది. నిన్నటి నుంచి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.


పెళ్లి కోసం ఇంటి దగ్గర పందిరి కూడా వేశారు. ఈ క్రమంలో అనంతప్ప పెళ్లి కోసం సరుకులు కొనుగోలు చేయడానికి మండల కేంద్రానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. అనంతప్ప బైకు మీద నుంచి కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయం అయింది. కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనంతప్ప తుది శ్వాస విడిచాడు.


కూతురి పెళ్లి కోసం వేసిన టెంట్‌లోనే అనంతప్ప మృతదేహాన్ని ఉంచారు. ఆ దృశ్యాలను చూసి గ్రామస్తులు సైతం కంటతడిపెట్టుకున్నారు. ఇక, అనంతప్ప కుటుంబసభ్యుల పరిస్థితి వర్ణణాతీతం. గుండెలవిసేలా వెక్కి వెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఇవి కూడా చదవండి

హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు..

రిజర్వేషన్ల జోరు.. సంక్రాంతి కష్టాలు షురూ.!

Updated Date - Nov 23 , 2025 | 05:48 PM