Software Engineer: సహోద్యోగిని ఫిర్యాదు.. టెకీ ఆత్మహత్య
ABN , Publish Date - Jan 31 , 2025 | 03:24 AM
ఏడాదిగా తనతో స్నేహంగా ఉంటున్న సహోద్యోగిని తాము పని చేసే కంపెనీలో తనపై ఫిర్యాదు చేసిందనే ఆందోళనతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

హెచ్‌ఆర్‌కు తనపై ఫిర్యాదు చేసిందని ఆందోళన
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
చెల్లెలికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి బలవన్మరణం
చౌటుప్పల్ రూరల్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఏడాదిగా తనతో స్నేహంగా ఉంటున్న సహోద్యోగిని తాము పని చేసే కంపెనీలో తనపై ఫిర్యాదు చేసిందనే ఆందోళనతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో జగిత్యాలకు చెందిన పిప్పరి వినీత్(26) మరణించాడు. జగిత్యాలకు చెందిన పిప్పరి వినీత్(26), అతని చెల్లెలు సంయుక్త హైదరాబాద్ ఈస్ట్‌మారేడుపల్లిలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అ న్నాచెల్లెళ్లు ఇద్దరూ బేగంపేటలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. అదే సంస్థలో పని చేసే మరో యువతితో వినీత్‌కు ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. అయి తే, ఇటీవల ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
ఈ క్రమంలో సదరు యువతి తాము పని చేసే సంస్థ హెచ్‌ఆర్‌కు వినీత్‌పై ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసి ఆందోళన చెందిన వినీత్ బుధవా రం విధులు పూర్తి చేసిన తర్వాత తన ద్విచక్రవాహనంపై దండుమల్కాపురం శివారులోని ఓ పైపుల పరిశ్రమ దగ్గరికి వెళ్లాడు. రాత్రి 11గంటల సమయంలో చెల్లెలు సంయుక్తకు ఫోన్ చేసి .. ఆ యువతి అకారణంగా తనపై ఫిర్యాదు చేసిందని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పారు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తన లోకేషన్ పంపి ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశాడు. అనంతరం ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పుపెట్టుకున్నాడు. సం యుక్త తన బంధువులతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకునే సరికి వినీత్ శరీరం పూర్తిగా కాలిపోయింది. వినీత్ తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.