Share News

Sabitha Reddy: మాజీమంత్రి సబితా సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:31 AM

రాష్ట్రంలో ప్లానింగ్‌లేని పాలన నడుస్తోందని, కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చే దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ధ్వజమెత్తారు.

Sabitha Reddy: మాజీమంత్రి సబితా సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

- రాష్ట్రంలో ప్లానింగ్‌ లేని అస్తవ్యస్త పాలన

- కాంగ్రెస్‌ కండువా ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లు

- మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ధ్వజం

హైదరాబాద్: రాష్ట్రంలో ప్లానింగ్‌లేని పాలన నడుస్తోందని, కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చే దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి(MLA Sabitha Reddy) ధ్వజమెత్తారు. ఒక కాలనీని ఎంత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామో రాష్ట్రాన్ని సైతం అదే తరహాలో అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో తలాతోకాలేని పాలన కొనసాగుతున్నదని ఆమె ఎద్దేవా చేశారు.


ఆదివా రం బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ నాదర్‌గుల్‌ 31వ డివిజన్‌లోని గ్రీన్‌రిచ్‌కాలనీలో ఎమ్మెల్యే పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం కాలనీవాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజా సంక్షేమం కన్నా రాజకీయమే ప్రధానంగా మారిందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.


city7.2.jpg

అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, అధికారులను వేధించడం మంచి పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాల ని, ప్రభుత్వంతో కొట్లాడైనా సరే నిధులు తీసుకువచ్చి పనులు చేయిస్తానని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో కౌన్సిల్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ సూర్ణగంటి అర్జున్‌, మాజీ కార్పొరేటర్లు పెద్దబావి శోభాఆనంద్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, లిక్కి మమతాకృష్ణారెడ్డి, బోయపల్లి దీపికాశేఖర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాసరాజు, కర్రె బల్వంత్‌, నరేశ్‌, సాయి పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్ న్యూస్.. రూ.98 వేల దిగువకు బంగారం.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఎంపీ రఘునందన్‌కు మళ్లీ బెదిరింపు కాల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jun 30 , 2025 | 11:31 AM