Repalle Express: రేపల్లె ఎక్స్‌ప్రెస్.. ఇక చర్లపల్లి నుంచి..
ABN , Publish Date - Apr 10 , 2025 | 08:08 AM
సికింద్రాబాద్-రేపల్లె మధ్య నడిచే రేపల్లె ఎక్స్‌ప్రెస్ రైలు ఇక చర్లపల్లి నుంచి బయలుదేరనుంది. ప్రయాణికుల రద్దీ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఏర్పడ్డ ఒత్తిడి కారణంగా సికింద్రాబాద్ కు బదులు చర్లపల్లికి మార్చినట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 15 నుంచి ఇది అమలులోకి వస్తుందన్నారు.

- 15 నుంచి రేపల్లె ఎక్స్‌ప్రెస్ టెర్మినల్ మార్పు
హైదరాబాద్ సిటీ: పునరాభివృద్ధి పనుల కారణంగా సికింద్రాబాద్-రేపల్లె(Secunderabad-Repalle) మధ్య నడిచే(17645) ఎక్స్‌ప్రెస్ బయల్దేరే టెర్మినల్ ఈ నెల 15 నుంచి చర్లపల్లికి మారుస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే(South Central Railway) ప్రకటించింది. ఈ రైలు చర్లపల్లి నుంచి ఇంతకు ముందు ప్రకటించిన సమయం మధ్యాహ్నం 1.30గంటలకు బదులు మధ్యాహ్నం ఒంటిగంటకు(అరగంట ముందుగా) బయల్దేరుతుందని సీపీఆర్‌ఓ తెలిపారు. ఈ మార్గంలో ఆగే ఇతర స్టేషన్లు/ వేళల్లో ఎటువంటి మార్పులేదని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: ఉదయం నుంచే భానుడి ప్రతాపం..
ఈ వార్తలు కూడా చదవండి:
Greenfield Expressway: హైదరాబాద్-అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్ హైవే
CM Revanth Reddy: బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు
Hyderabad: ఫోన్‌లో మాట్లాడవద్దన్నందుకు.. ఆ బాలిక ఏం చేసిందో తెలిస్తే..
Read Latest Telangana News and National News