Drunk And Drive: ఈ మందుబాబుది మామూలు యాక్షన్ కాదు.. ఆస్కార్ లెవెల్లో
ABN , Publish Date - May 08 , 2025 | 09:45 AM
Drunk And Drive: వికారాబాద్ జిల్లాలో గత రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో పరిగిలో ఓ మందుబాబు పోలీసులకే చుక్కలు చూపించాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో అతడు మద్యం తాగినట్లు బయటపడింది.

వికారాబాద్, మే 8: ‘మందుబాబులం మేము మందుబాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం’ అని ఓ సినిమాలోని పాటలాగే ప్రవర్తిస్తారు మందుబాబులు. కొందరు మందు తాగి నానా బీభత్సం సృష్టిస్తుంటారు. ఒక్కోసారి వారి చేష్టలు చూస్తే ఫన్నీగా ఉంటాయి. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డప్పుడు చూడాలి వాళ్ల తిప్పలు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నానా హంగామా చేస్తుంటారు. అవసరమైతే కాళ్లు పట్టుకుంటారు.. లేదంటే పోలీసులనే ఎదురిస్తుంటారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసేందుకు ససేమిరా అంటుంటారు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా వారినే దబాయిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా అలాంటి పనే చేశాడు. మందు తాగడమే కాకుండా పోలీసులకే ఎదురుతిరిగాడు. చివరకు పోలీసుల చేసిన పనితో తనలోని నటుడిని బయటకు తీశాడు. ఎంతలా అంటే ఆ వ్యక్తి ఆస్కార్ లెవల్లో యాక్స్న్ చేసి పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇతగాడి కథేంటో ఇప్పుడు చూద్దాం.
వికారాబాద్ జిల్లాలో గత రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో పరిగిలో ఓ మందుబాబు పోలీసులకే చుక్కలు చూపించాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో అతడు మద్యం తాగినట్లు బయటపడింది. మద్యం సేవించి వాహనం నడుపుతున్న కారణంగా అతడికి ఫైన్ వేశారు పోలీసులు. ఇది చూసి పోలీసులపైకే తిరగబడ్డాడు సదరు మందు బాబు. తనకు ఫైన్ ఎలా వేస్తారంటూ కాప్స్‌తో వాగ్వాదానికి దిగాడు. అంతే కాకుండా పోలీసులనే బెదిరించాడు కూడా. ముందు మందు అమ్మడం ఆపి తనకు ఫైన్ వేయాలంటూ డిమాండ్ చేశాడు. అంతటితో ఆగకుండా రోడ్డుపై పడుకొని వాహనాలను ఆపే ప్రయత్నం చేశాడు. ఇతడి వ్యవహరంతో విసుగెత్తిపోయిన పోలీసులు.. వెంటనే పోలీస్‌స్టేషన్ తరలించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ మందు బాబు తనలోని నటుడిని బయటకు తీశాడు.
Donald Trump: ఆపరేషన్ సిందూర్‌పై డొనాల్డ్ ట్రంప్ స్పందన
అప్పటి వరకు పోలీసులకే చుక్కులు చూపించి రోడ్డుపై నానా హంగామా చేసి ఆ వ్యక్తి.. పోలీస్‌స్టేషన్ అనగానే మరో నటనకు తెరతీశాడు. తన కాలు విరొగొట్టారంటూ ఆస్కార్ లెవల్లో యాక్షన్ చేశాడు. దీంతో అప్పటి వరకు భీభత్సం సృష్టించిన మందు బాబు ఒక్కసారిగా కాలు విరొగొట్టారంటూ అరవడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఆ తరువాత అతడి యాక్షన్‌ను కనిపెట్టిన పోలీసులు వెంటనే పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి
Father Takes Revenge: కూతురి హత్య.. ఏడాది తర్వాత ప్రతీకారం తీర్చుకున్న తండ్రి..
Pok ceasefire violation: సరిహద్దు పోస్టుల వద్ద పాక్ సైన్యం కాల్పులు..
Read Latest Telangana News And Telugu News