TG News: అమ్మ అనాథగా మారింది.. కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకు
ABN , Publish Date - Jun 23 , 2025 | 09:21 PM
వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం నస్కల్ గ్రామంలో దారుణం జరిగింది. పోషణ భారమైందని ఎనభై ఏళ్ల వయసున్న కన్న తల్లి సత్యమ్మను, పక్షవాతంతో బాధపడుతున్న తమ్ముడు మహిపాల్ రెడ్డిని ఇంట్లో నుంచి గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి గెంటి వేశాడు.

వికారాబాద్: జిల్లాలోని పరిగి మండలం నస్కల్ గ్రామంలో దారుణం జరిగింది. పోషణ భారమైందని ఎనభై ఏళ్ల వయసున్న కన్న తల్లి సత్యమ్మను, పక్షవాతంతో బాధపడుతున్న తమ్ముడు మహిపాల్ రెడ్డిని ఇంట్లో నుంచి గోవర్ధన్ రెడ్డి (Govardhan Reddy) అనే వ్యక్తి గెంటి వేశాడు. ఎనభై ఏళ్ల వయస్సులో పక్షవాతంతో ఉన్న కొడుకును తీసుకొని ఎటుపోవాలంటూ.... తనకు న్యాయం చేయాలని సత్త్యమ్మ పోలీసులను ఆశ్రయించింది.
కూతుర్లు కూడా తనను చూసుకునేందుకు ఇష్టపడటం లేదని సత్త్యమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. సత్యమ్మకు సంతానంగా ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉండగా అందరి పెళ్లిళ్లు అయిపోయాయి. చిన్న కొడుకు మహిపాల్ భార్య నాలుగేళ్ల క్రితం చనిపోగా... అతను పక్షవాతంతో బాధపడుతూ పొలం వద్ద గుడిసెలో నివాసం ఉంటున్నాడు. అప్పటి నుంచి సత్త్యమ్మ మొత్తం ఆస్థి గోవర్ధన్ రెడ్డి ఆధీనంలోనే ఉంది. సత్యమ్మ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు అతన్ని పిలిచి గట్టిగా అడగటంతో పశ్చాతాప పడ్డ గోవర్ధన్ తల్లిని, తమ్మున్ని ఇంటికి తీసుకెళ్లాడు. గతంలో కూడా మూడు సార్లు తల్లిని గెంటేసే ప్రయత్నం చేయగా గ్రామస్థులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
ఆ పార్టీ నేతలను రప్పా రప్పా జైలులో వేయాలి: బీజేపీ ఎంపీ
For More Telangana News and Telugu News