KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:10 PM
KTR: ‘‘రాష్ట్రంలో రుణమాఫీ వంద శాతం పూర్తయిందని నిరూపిస్తే.. నేను, మా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తాం’’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీలు ఇచ్చి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. కేవలం ఫ్రీ బస్సుతో సరిపెట్టారని అన్నారు.

రంగారెడ్డి, జనవరి 17: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) మరోసారి విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR). తెలంగాణ ప్రజలను రేవంత్ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఏర్పాటు చేసిన రైతు సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. . ‘‘రాష్ట్రంలో రుణమాఫీ వంద శాతం పూర్తయిందని నిరూపిస్తే.. నేను, మా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తాం’’ అంటూ సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీలు ఇచ్చి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. కేవలం ఫ్రీ బస్సుతో సరిపెట్టారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీయాలన్నారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు రేవంత్ రూ.30 వేలు బాకీ పడ్డారని.. రూ.30 వేలు ఇస్తేనే ఓటేస్తామని మహిళలు నిలదీయాలని మాజీ మంత్రి అన్నారు.
ఎన్నికలప్పుడు రూ.7600 కోట్లు రైతుబంధు వేసేందుకు తాము సిద్ధమైతే ఈసీకి లేఖ రాసి రైతు బంధును వేయనీయకుండా అడ్డుకున్నారన్నారు. యాసంగి పంట సమయంలో రైతుల కోసం రూ.7600 కోట్లు పెడితే.. రేవంత్ ప్రభుత్వం వచ్చాక నాట్లు వేసే సమయంలో కాకుండా.. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రైతుల ఖాతాలో వేశారని విమర్శించారు. ఒక్కసారి మాత్రమే కేసీఆర్ ఇచ్చిన డబ్బులను రైతు భరోసా కింద వేశారని.. ఆ తరువాత రైతు భరోసా ముచ్చటే లేదన్నారు. ఖచ్చితంగా జనవరి 26న రైతులకు ఇస్తానన్న రైతు భరోసాను ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు.
Kaushikreddy: కావాలనే కేసులు.. విచారణ తర్వాత కౌశిక్ రెడ్డి కామెంట్స్
అది కూడా రూ.12 వేలు కాదు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.15 వేలను రైతుల ఖాతాలో జమ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వానాకాలం పంటకు ఎగ్గొట్టిన రైతు బంధును కూడా రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుకు ప్రతీ ఎకరానికి రూ.17500 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నారని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఓటేయమని అడిగితే.. ముందు బాకీ తీర్చాకే ఓటు వేస్తామని గట్టిగా చెప్పాలని రైతులకు చెప్పారు. రైతులకు ఎకరానికి రూ.17500 బాకీ ఉంటే.. మహిళలకు సంవత్సరానికి రూ.30 వేల మేర రేవంత్ రెడ్డి బాకీ ఉన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏఐతో ఇలా కూడా చేస్తారా.. ఏకంగా దేశ ప్రధానినే
Read Latest Telangana News And Telugu News