Shamshabad: విమానంలో గుండెపోటు.. ఆస్పత్రికి ప్రయాణికుడి తరలింపు
ABN , Publish Date - Oct 30 , 2025 | 08:28 AM
జెడ్డా నుంచి శంషాబాద్ వస్తున్న విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న 6ఈ68 ఇండిగో విమానంలో నగరంలోని అంబర్‌పేటకు చెందిన మహ్మద్ ఖాసీం(79)కు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.
- అప్పటికే మృతి
శంషాబాద్(హైదరాబాద్): జెడ్డా నుంచి శంషాబాద్ వస్తున్న విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న 6ఈ68 ఇండిగో విమానం(6E68 Indigo flight)లో నగరంలోని అంబర్‌పేటకు చెందిన మహ్మద్ ఖాసీం(79)కు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. మరికొద్ది సేపట్లో విమానం ల్యాండ్ అవుతుందనగా చాతీలో నొప్పి వస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ సిబ్బందికి చెప్పారు.

వారు అతనికి సీపీఆర్ చేశారు. ఉదయం 9.27 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport)లో విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఖాసీంను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ప్రైవేటు అంబులెన్స్‌లో అంబర్‌పేటలోని స్వగ్రహానికి తరలించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్.. భిన్నంగా ఓటర్ పల్స్!
బీఆర్‌ఎస్ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు
Read Latest Telangana News and National News