Share News

Dharmapuri Arvind: చట్టాన్ని పని చేసుకోనివ్వకపోతే లాఠీలకు పని

ABN , Publish Date - Jan 07 , 2025 | 05:14 AM

చట్టం తన పనిని తాను చేసుకోనివ్వకపోతే లాఠీలు పని చేయాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు.

Dharmapuri Arvind: చట్టాన్ని పని చేసుకోనివ్వకపోతే లాఠీలకు పని

  • దర్యాప్తు సంస్థలకు కేటీఆర్‌ సహకరించాలి: ఎంపీ అర్వింద్‌

న్యూఢిల్లీ, జనవరి 6(ఆంధ్రజ్యోతి): చట్టం తన పనిని తాను చేసుకోనివ్వకపోతే లాఠీలు పని చేయాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ఫార్ములా ఈ- రేస్‌ కేసులో కేటీఆర్‌ చేసింది దొంగతనమని, పైగా న్యాయవాదులు లేకపోతే విచారణకు వెళ్లనని తమాషా చేస్తున్నారని చెప్పారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెల్లె కవితనేమో ఈడీ ఇంటికే రావాలని, ఏసీ కిందే విచారణ జరపాలంటూ కోరారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, ముఖ్యమంత్రి, మంత్రి అనే భ్రమలోంచి బయటకు రావాలన్నారు. తమాషాలు మాని ఏసీబీ దర్యాప్తునకు సహకరించాలని కేటీఆర్‌కు అర్వింద్‌ ఒక ప్రకటనలో హితవు పలికారు.

Updated Date - Jan 07 , 2025 | 05:14 AM