రాహుల్‌ను ప్రధానిని చేసే బాధ్యత రేవంత్ తీసుకోవాలి: మల్లు రవి
ABN , Publish Date - Jan 30 , 2025 | 05:03 AM
రాహుల్‌గాంధీని ప్రధానిని చేసే బాధ్యతను సీఎం రేవంత్‌రెడ్డి భుజాన వేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు.

హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీని ప్రధానిని చేసే బాధ్యతను సీఎం రేవంత్‌రెడ్డి భుజాన వేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారని, జాతీయ నేతగానూ పేరు తెచ్చుకుంటున్నారని కొనియాడారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలపై చర్చకు సిద్ధమా అని బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు.