Drug Bust: భాయ్.. బచ్చా ఆగయా..!
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:18 AM
భాయ్.. బచ్ఛా ఆగయా..!’’ అంటూ కోడ్ భాషలో గంజాయి విక్రయించే మహారాష్ట్ర వాసి సందీప్, మరో 14 మంది వినియోగదారుల ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ వింగ్ - ఈగల్ కట్టించింది.

గంజాయి స్మగ్లర్ల కోడ్ భాష
గచ్చిబౌలిలో ఈగల్ స్కెచ్
14 మంది కొనుగోలుదార్ల అరెస్టు
స్పాట్‌లో పరీక్ష.. అందరికీ పాజిటివ్
స్మగ్లర్ సందీప్ ఫోన్లో 100 నంబర్లు
మిగతా వారు లొంగిపోవాలి: ఈగల్
హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ‘‘భాయ్.. బచ్ఛా ఆగయా..!’’ అంటూ కోడ్ భాషలో గంజాయి విక్రయించే మహారాష్ట్ర వాసి సందీప్, మరో 14 మంది వినియోగదారుల ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ వింగ్ - ఈగల్ కట్టించింది. పట్టుబడ్డ గంజాయి కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులే కావడం గమనార్హం..! ఈగల్ డైరక్టర్ సందీప్ శాండిల్య కథనం ప్రకారం.. మహరాష్ట్రకు చెందిన సందీప్ ప్రతీవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి గంజాయితో వస్తుంటాడు. తన వినియోగదారులకు ‘‘భాయ్.. బచ్ఛా ఆగయా’’ అంటూ కోడ్ భాషలో సందేశాలు పంపి.. గంజాయి సరుకు వచ్చిందనే సమాచారం ఇస్తాడు. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు సమీపంలో అడ్డాను ఏర్పాటు చేసుకుని, 100 మంది రెగ్యులర్ కస్టమర్లకు ఒక్కో ప్యాకెట్‌లో 50 గ్రాముల గంజాయిని పెట్టి, విక్రయిస్తుంటాడు. ఒక్కో ప్యాకెట్‌కు రూ.3 వేలు వసూలు చేస్తుంటాడు. శనివారం కూడా సందీప్ 100 గంజాయి ప్యాకెట్లతో గచ్చిబౌలికి వచ్చాడు. ఉప్పందుకున్న ఈగల్ బృందాలు.. కాపుకాచి, అతణ్ని అరెస్టు చేశాయి.
అతని ఫోన్‌లో 100 మంది కస్టమర్ల డేటాను ఈగల్ బృందాలు సేకరించాయి. సందీప్ ఇచ్చిన సమాచారం మేరకు.. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు వద్దకు వచ్చే వినియోగదారుల కోసం వలపన్నాయి. ఈ క్రమంలో ఆన్‌లైన్ ట్రేడింగ్ వ్యాపారి నవీన్(31), విద్యార్థి ఆయూష్(22), రేసింగ్ ఇంజనీర్ నిఖిల్(29), ఆర్కిటెక్ట్ సిందూర(26), ప్రాపర్టీ మేనేజర్ హసన్(34), ఐటీ ఉద్యోగులు క్రాంతి(28), తుషార్(24), అర్పిత(24), డెంటల్ టెక్నీషియన్ అఖిల్(28), బిజినెస్ రిలేషన్‌షి్‌ప మేనేజర్ శివ(32), ఫ్రీలాన్స్ యాడ్స్ ఏజెన్సీ నిర్వాహకుడు సందేశ్(34), రియల్‌ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ సాయిరాజ్(31), ట్రావెల్ ఏజన్సీ ఉద్యోగి అఖిల్(26), డ్రైవర్ స్వామి(27) ఈగల్ బృందాలకు పట్టుబడ్డారు. వీరందరికీ అప్పటికప్పుడు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో వీరిని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. వీరిలో ఇద్దరు దంపతులున్నట్లు పోలీసులు తెలిపారు. సందీప్ కాంటాక్ట్‌లో ఉన్న మిగతా 86 మంది లొంగిపోవాలని, లేనిపక్షంలో వారి ఇంటికి వెళ్లి అరెస్టు చేస్తామని సందీప్ శాండిల్య హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వికసిత్ తెలంగాణ బీజేపీకే సాధ్యం
Read Latest Telangana News And Telugu News