Share News

Leopard: ఇక్రిశాట్‌లో బంధించిన చిరుత జూకు తరలింపు..

ABN , Publish Date - Apr 18 , 2025 | 07:53 AM

సంగారెడ్డి జిల్లా పటాన్‏చెరువు మండలం ఇక్రిశాట్‌ క్యాంపస్‏లో సంచరిస్తున్న చిరుతను జూపార్కు అధికారులు బంధించి దానిని అక్కడకు తరలించారు. పటాన్‏చెరువు మండలం ఇక్రిశాట్‌ క్యాంపస్‏లో వేలిది ఎకరాల్లో వివిధ పంటలకు సంబంధించిన పరిశోదనలు జరుగుతుంటాయి. అయితే.. ఎక్కడినుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కాని చిరుతపులి సంచారాన్ని సిబ్బందితోపాటు స్థానికులు గుర్తించారు. అనంతరవ విషయాన్ని అదికారులకు తెలియజేయగా ఎట్టకేలకు దానిని గుర్తించి బంధించారు.

Leopard: ఇక్రిశాట్‌లో బంధించిన చిరుత జూకు తరలింపు..

హైదరాబాద్: పటాన్‏చెరువు మండలం ఇక్రిశాట్‌ క్యాంపస్(ICRISAT Campus)లో సంచరిస్తున్న చిరుతను జూపార్కు అధికారులు బంధించి గురువారం జూపార్కుకు తరలించారు. ఇక్రిశాట్‌ క్యాంపస్‌లో చిరుత సంచరిస్తున్నట్లు ఉద్యోగులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయం ఉన్నతాధికారులు సంగారెడ్డి(Sangareddy) జిల్లా అటవీశాఖ అధికారులకు తెలిపారు. వారి ఆదేశాల మేరకు జూపార్కు రెస్క్యూ టీమ్‌ హెడ్‌ డాక్టర్‌ ఎం.ఎ హకీమ్‌ నేతృత్వంలో సిబ్బంది ఇక్రిశాట్‌కు వెళ్లి చిరుతను బోనులో బంధించారు. సుమారు ఆరేళ్ల వయస్సున్న చిరుత ఆరోగ్యంగా ఉందని క్యూరేటర్‌ జె.వసంత తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమ్రాబాద్‌ ఫారెస్ట్(Amrabad Forest)‏లో వదలిపెడతామన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Fruit juices: వామ్మో.. పండ్ల రసాలు..


city2.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..

సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి


city2.3.jpg

సీఎం రేవంత్‌కు బీజేపీ ఎంపీ సవాల్

అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

నదిలో పడవ బోల్తా..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 18 , 2025 | 07:53 AM