Share News

కేటీఆర్‌పై సర్కార్‌ది కక్షపూరిత ధోరణి: కవిత

ABN , Publish Date - Jan 07 , 2025 | 05:20 AM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

కేటీఆర్‌పై సర్కార్‌ది  కక్షపూరిత ధోరణి: కవిత

ఆసిఫాబాద్‌, ఇంద్రవెల్లి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం ఆదిలాబాద్‌, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు రూ.12వేలు ప్రకటించి రైతులను మోసం చేశారని విమర్శించారు. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ కార్యాకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారని, బీఆర్‌ఎస్‌ ధర్నాలకు భయపడిన ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ నేతలను అక్రమ కేసులతో వేధిస్తోందన్నారు.


ఆసిఫాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా జైనూరు మండలంలో లైంగిక వేధింపుల బాధితురాలిని, వాంకిడి మండలంలో పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌ అయి మృతిచెందిన విద్యార్థి శైలజ కుటుంబాలను కవిత పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.2లక్షల చొప్పున ఆర్థికసహాయం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

Updated Date - Jan 07 , 2025 | 05:20 AM