Share News

MLA: ఎమ్మెల్యే సబితరెడ్డి ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

ABN , Publish Date - Mar 05 , 2025 | 10:03 AM

తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజన్‌ అంటూ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) పాలిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి(MLA Pattolla Sabitha Indra Reddy) విమర్శించారు.

MLA: ఎమ్మెల్యే సబితరెడ్డి ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

- విజన్‌లేని రేవంత్‌ పాలన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజన్‌ అంటూ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) పాలిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి(MLA Pattolla Sabitha Indra Reddy) విమర్శించారు. రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదన్నారు. కేవలం ఫ్లెక్సీలకే వాటిని పరిమితం చేసి ప్రచారం చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. మంగళవారం సరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని హుడా కాంప్లెక్స్‌లో పర్యటించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Electricity: ఆ ఏరియాల్లో.. మధ్యాహ్నం 2 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్..


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి దృష్ట్యా మంచినీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ, శానిటేషన్‌ సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. హుడా కాంప్లెక్స్‌(HUDA Complex)లో పార్కు నిర్వహణ సరిగాలేదని, ఆకతాయిలు, పోకిరీలు పార్కులోకి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా భవనాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.


city8.2.jpg

ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వేంకటేశ్వరకాలనీలో సమస్యలను పరిష్కరించాలని కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ సరూర్‌నగర్‌ సర్కిల్‌ ఉపకమిషనర్‌ సుజాత, మహేశ్వరం నియోజకవర్గ యూత్‌ మాజీ అధ్యక్షుడు లోకసాని కొండల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ దర్పల్లి అశోక్‌, వేంకటేశ్వరకాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ధనంరెడ్డి, కార్యదర్శి కనకారావు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తను కూడా చదవండి: పదవుల కోసం పైరవీలు వద్దు

ఈ వార్తను కూడా చదవండి: సకల సదుపాయాలతో అర్బన్‌ పార్కులు

ఈ వార్తను కూడా చదవండి: ప్రజారోగ్యంపై పట్టింపేదీ!

ఈ వార్తను కూడా చదవండి: హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 05 , 2025 | 10:03 AM