Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ కేసు.. విజయ్ స్టేట్‌మెంట్ రికార్డ్
ABN , Publish Date - Nov 11 , 2025 | 04:01 PM
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న హీరో విజయ్ దేవరకొండ.. సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 11: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో (Online Betting App Case) సినీ నటుడు విజయ్ దేవరకొండ (Hero Vijay Devarakonda) సీఐడీ విచారణకు (CID Investigation) హాజరయ్యారు. నటుడి నుంచి స్టేట్‌మెంట్‌ను సీఐడీ అధికారులు రికార్డ్ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు సీఐడీకి బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు నటుడు విజయ్ దేవరకొండకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈరోజు (మంగళవారం) సీఐడీ విచారణకు హీరో హాజరయ్యారు.
కాగా... ఇదే కేసుకు సంబంధించి ఆగస్టు 6 న విజయ్ దేవరకొండను ఈడీ విచారణ చేసింది. ఏ23 అనే గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడంతో విజయ్‌ను ఈడీ, సీఐడీ విచారణ చేశాయి. విచారణలో భాగంగా ఏ 23 గేమింగ్ యాప్ కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్ వివరాలను సీఐడీకి విజయ్ దేవరకొండ అందజేశారు. తాను ప్రమోట్ చేసిన A23 గేమింగ్ యాప్ తెలంగాణలో ఓపెన్ అవ్వదని సీఐడీకి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇకపై తాను ఎలాంటి గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయనని చెప్పినట్లు సమాచారం తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
అంత్యక్రియలకు హాజరైన సీఎం రేవంత్.. అందెశ్రీ సతీమణికి ఓదార్పు
తుఫాను బాధితులకు తక్షణ సాయంగా రూ.12.99 కోట్లు విడుదల
Read Latest Telangana News And Telugu News