Telangana Govt: తుఫాను బాధితులకు తక్షణ సాయంగా రూ.12.99 కోట్లు విడుదల
ABN , Publish Date - Nov 11 , 2025 | 02:07 PM
మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వరదల కారణంగా ఆస్తినష్టం వాటిల్లింది. ఈ క్రమంలో వరదల్లో నష్టపోయిన కుటుంబాల కోసం ప్రభుత్వం తక్షణ సాయం కింద నిధులను విడుదల చేసింది.
హైదరాబాద్, నవంబర్ 11: మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధిత కుటుంబాలకు రూ.12.99 కోట్లు తక్షణ సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఈరోజు (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేసింది. మొంథా తుఫాను ప్రభావంతో ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలసిందే. ఈ క్రమంలో వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలతో దెబ్బతిన్న ఇళ్ళకు రూ.15,000 చొప్పున సాయం అందిస్తూ రెవిన్యూ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లా కలెక్టర్లు పంపించిన నివేదికల ప్రకారం 15 జిల్లాల్లో 8662 ఇండ్లు దెబ్బతినగా.. వీరికి తక్షణ సాయంగా రూ.12.99 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు.
కాగా.. అక్టోబర్ 27 నుంచి 30 వరకు వరుసగా నాలుగు రోజులు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వరంగల్, హన్మకొండ, వికారాబాద్, వనపర్తి, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కోతగూడెం, నల్గొండ జిల్లాలు భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
త్వరలోనే ఏపీకి మరిన్ని పరిశ్రమలు: మంత్రి పయ్యావుల
అంత్యక్రియలకు హాజరైన సీఎం రేవంత్.. అందెశ్రీ సతీమణికి ఓదార్పు
Read Latest Telangana News And Telugu News