Share News

Ande Sri Funeral: అంత్యక్రియలకు హాజరైన సీఎం రేవంత్.. అందెశ్రీ సతీమణికి ఓదార్పు

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:03 PM

ప్రముఖ కవి అందెశ్రీ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అందెశ్రీ పాడెను మోశారు. ఆయన సతీమణిని సీఎం ఓదార్చారు.

Ande Sri Funeral: అంత్యక్రియలకు హాజరైన సీఎం రేవంత్.. అందెశ్రీ సతీమణికి ఓదార్పు
Ande Sri Funeral

హైదరాబాద్, నవంబర్ 11: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) పార్ధీవ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. ఈరోజు (మంగళవారం) ఘట్కేసర్ చేరుకున్న సీఎం.. అందెశ్రీ అంత్యక్రియలకు హాజరయ్యారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆయన సతీమణిని ఓదార్చారు. అందెశ్రీ పాడెను సీఎం రేవంత్ మోశారు. కాగా.. ఈరోజు ఉదయం అందెశ్రీ అంతిమయాత్ర ప్రారంభమైంది. లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్‌ వరకు అంతిమయాత్ర సాగింది.


మరికాసేపట్లో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. అంత్యక్రియలకు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వి. హెచ్ హాజరయ్యారు.


కాగా.. ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూసిన విషయం తెలిసిందే. నిన్న (సోమవారం) ఉదయం ఇంట్లోనే కుప్పకూలి పడిపోయిన ఆయనను.. కుటుంబసభ్యులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఉదయం 7:25 గంటలకు అందెశ్రీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అందెశ్రీ మృతి పట్ల రచయితలు, రాజకీయ నేతలు, ప్రముఖులు ఘన నివాళులర్పించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

అదే లక్ష్యంతో చంద్రబాబు, లోకేష్ ముందడుగు: మంత్రి లోకేష్

త్వరలోనే ఏపీకి మరిన్ని పరిశ్రమలు: మంత్రి పయ్యావుల

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 11 , 2025 | 01:23 PM