Kishan Reddy On MIM: ఎంఐఎం కోటలు బద్దలు కొడతాం
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:02 PM
Kishan Reddy On MIM: హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఈసారి కచ్చితంగా హైదరాబాద్ నగరంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని.. మేయర్ పీఠం మీద కూర్చోబోయేది భారతీయ జనతా పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్, ఏప్రిల్ 5: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు తమదే అని రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో (ABN- Andhrajyothy) కిషన్ రెడ్డి మాట్లాడుతూ... తమకు సంఖ్యా బలం లేదని అందరూ అంటున్నారని.. కానీ అభివృద్ధిని కాంక్షిచే వారు బీజేపీకే (BJP) ఓటు వేయబోతున్నారని చెప్పారు. ఇక అధికారంలో ఎవరు ఉన్నా మజ్లిస్‌కు హైదరాబాద్ రాసి ఇవ్వడం అలవాటుగా మారిందన్నారు. అందులో భాగంగానే ఈసారి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉంటే వాళ్లతో అంటకాగి హైదరాబాద్‌ను దోచుకోవడం ఎంఐఎంకు పరిపాటి అయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎంఐఎం కోటలు బద్దలు కొడతామని స్ఫష్టం చేశారు.
సంఖ్యా బలం ఉంటే బీజేపీనే గెలిచేదని.. సంఖ్యా బలం లేదు కాబట్టే ఓటింగ్ జరుగుతోందన్నారు. ఈ ఎన్నికల్లో 120 మంది ఓటర్లు ఆచితూచి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా, హిందువులకు, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇచ్చే పార్టీ మజ్లిస్ పార్టీ అంటూ మండిపడ్డారు. గతంలో హైదరాబాద్‌లో అనేక సార్లు మతకలహాలు ప్రేరింపించిందన్నారు. అలాంటి మజ్లిస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు పోటీ చేయకుండా ఉండటం రాజకీయ కుట్రే అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ కూడా ఎంఐఎంకు బానిసత్వంతో ఉండే పార్టీలని వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీని పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ కనుసైగలో ఈ రెండు పార్టీలు నడుస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ కూడా ఎంఐఎం పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతూ పెంచి పోషిస్తున్నాయన్నారు. మజ్లిస్‌కు ఓటేస్తే ప్రజలెవరూ కూడా క్షమించరని అన్నారు.
Bandi Sanjay Letter: కరీంనగర్‌లో టీటీడీ ఆలయం.. బీఆర్ నాయుడుకు బండి లేఖ
హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. ఈసారి కచ్చితంగా హైదరాబాద్ నగరంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని.. మేయర్ పీఠం మీద కూర్చోబోయేది భారతీయ జనతా పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలకు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధం లేదని అన్నారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి మజ్లిస్ పార్టీని ఓడించాలని... బీజేపీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. పార్టీలో అంతర్గత విబేధాలు ఉండటం సహజమని చెప్పుకొచ్చారు. అలాంటివి ఏవైనా ఉంటే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Read Latest Telangana News And Telugu News