Share News

Telangana Police: పేలుళ్ల కుట్ర.. తెలంగాణ పోలీసుల స్పెషల్ ఆపరేషన్

ABN , Publish Date - May 18 , 2025 | 12:02 PM

తెలంగాణ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. పేలుళ్లకు కుట్ర పన్నిన వారికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అసలేం జరిగింది.. మన పోలీసులు పేలుళ్ల కుట్రను ఎలా ఛేదించారు.. అనేది ఇప్పుడు చూద్దాం..

Telangana Police: పేలుళ్ల కుట్ర.. తెలంగాణ పోలీసుల స్పెషల్ ఆపరేషన్
Hyderabad

తెలంగాణ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన వారికి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మన పోలీసులు. పక్కా ప్లానింగ్‌తో బ్లాస్ట్‌ చేద్దామనుకున్న విజయనగరానికి చెందిన సిరాజ్, సమీర్‌ అనే ఇద్దరు నిందితుల్ని స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. సిరాజ్-సమీర్‌ కలసి హైదరాబాద్‌లో బ్లాస్ట్‌లకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి.. హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్ట్‌కు ప్లాన్ చేశారని బయటపడింది. సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యూల్ సమీర్-సిరాజ్‌కు ఆదేశాలు ఇచ్చింది.


తప్పిన ముప్పు..

పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రసంస్థలు, వాటి స్థావరాలపై అటాక్ చేయడం తెలిసిందే. ప్రతిదాడులకు దిగిన పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేయడం, ఆ దేశ ఎయిర్‌బేస్‌లు ధ్వంసం చేయడం చూస్తూనే ఉన్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రాలన్నీ అలర్ట్‌గా ఉండాలని ఇటీవల ఆదేశించింది కేంద్రం. పాకిస్థాన్ ప్రేరేపిత స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యే ప్రమాదం ఉందని.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని మోదీ సర్కారు హెచ్చరించింది. ఈ తరుణంలో హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నడం కలకలం సృష్టించింది. అయితే తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. బ్లాస్ట్‌లకు ప్లాన్ చేసిన ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకొని ముప్పును తప్పించారు. దీంతో పోలీసుల మీద ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.


ఇవీ చదవండి:

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

చీఫ్ మినిస్టర్ ఓఎస్‌డీ అంటూ వ్యాపారులకు వల..

రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలివే..

మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 18 , 2025 | 12:23 PM