Share News

Summer Vacation Safety Tips: తస్మాత్ జాగ్రత్త.. పిల్లల సరదా ఆట విషాదం కావొద్దు

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:50 PM

Summer Vacation Safety Tips: వేసవి సెలవులు వచ్చేయడంతో పిల్లలు ఊర్లకు పయనమయ్యారు. ఇక అక్కడ వారి ఆటలకు అంతే ఉండదు. వేసవి తాపం తీర్చుకునేందుకు సరదాగా చెరువులు, బావుల వద్దకు వెళ్తుంటారు.

Summer Vacation Safety Tips: తస్మాత్ జాగ్రత్త.. పిల్లల సరదా ఆట విషాదం కావొద్దు
Summer Vacation Safety Tips

విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్న వేసవి సెలవులు రానే వచ్చేశాయి. వార్షిక పరీక్షలు అయిపోవడంతో స్కూళ్లకు సెలవు ప్రకటించేశారు యాజమాన్యాలు. అంతకు ముందే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఒంటిపూట బడులు నడిచాయి. ఇక ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోవడంతో పిల్లలకు హాలిడేస్ ఇచ్చేశారు. దాదాపు నెలన్నర పాటు పిల్లలకు సెలవులు ఉంటాయి. సెలవులు వచ్చేయడంతో ఇక పిల్లలు ఊర్ల బాట పట్టారు. అమ్మమ్మ వాళ్లింటికి లేదా బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. ఇక సెలవుల్లో పిల్లల ఆటకు అంతే ఉండదు. ప్రస్తుతం చదువు కూడా ఏమీ లేకపోవడంతో ఆటల్లో పడుతుంటారు. ఇందుకు పెద్దలు కూడా అడ్డు చెప్పరు. అయితే ప్రస్తుతం ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ఊర్లల్లోకి వెళ్లే చిన్నారులు వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు బావులు, చెరువులు వద్దకు వెళ్తుంటారు. సరదాగా అక్కడ ఈత కొడుతూ ఎండ బారి నుంచి ఉపశమనం పొందుతారు. అయితే బావులు, చెరువుల వద్దకు పిల్లలు వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే సరదా ఆటలో కూడా ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు లేకపోలేదు. ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే చెరువుల్లో ఈతకొడుతూ సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.


ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా

చెరువుల వద్దకు వెళ్లే పిల్లలకు ముందు ఈత రావాల్సిందే. లేదంటే చెరువుల్లో దిగాక ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు పెద్దలు ముందుగా ఈత నేర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈత వచ్చిన వారి వద్దే ఈత నేర్చుకోవడం ముఖ్యం. ఈత నేర్చుకోవలనుకునే పిల్లల కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పట్టణాలు, నగరాల నుంచి ఊర్లలోని బంధువుల ఇళ్లకు వచ్చే పిల్లలకు ఈత కొట్టడంపై సరైన అవగాహన ఉండి ఉండదు. ఇలాంటి వారే ఎక్కువగా ప్రమాదాల బారిని పడుతుంటారు. ఈతరాని పిల్లలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న కూడా నీటి మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వారిని పెద్దలు ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి. ఒకవేళ చెరువుల వద్దకు వెళ్లి ఈత కొట్టాలని పిల్లలు పట్టుబడితే మాత్రం.. వారిని ఒక్కరినే పంపించడకుండా పెద్దవారు కూడా వారి వెంట వెళ్లి జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల సరదా కుటుంబాల్లో విషాదాన్ని నింపకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచింది.

History Of OK: ‘ఓకే’.. అసలు చరిత్ర ఇదే


ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

ఈతకు వెళ్లే చిన్నారులకు అవసరమైతే లైఫ్ జాకెట్లు ఉపయోగించాలి. అలాగే చెరువులు, కుంటలు, బావుల్లో లోతు ఎంత ఉందో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈతరాని వారు చెరువుల్లో దిగకపోవడమే ఉత్తమం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంటరిగా చిన్నారులను ఈతకు పంపించవద్దు. పిల్లల వెంట ఈత వచ్చిన వారు కచ్చితంగా ఉండాల్సిందే.


ఇవి కూడా చదవండి

Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా

Gold Purity: ఇంట్లోనే బంగారం ప్యూరిటీని చెక్‌ చేసుకోండిలా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 01:52 PM