Home » Schools
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించేలా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) అమల్లోకి రానుంది. శుక్రవారం నుంచి తెలంగాణ విద్యాశాఖ ఎఫ్‌ఆర్‌ఎస్ ను అమలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.
నాలుగో తరగతి పాఠ్యాంశంలో మాసాయిపేట మానని గాయాన్ని చేర్చారు ఉపాధ్యాయులు. 11 ఏళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో రుచిత అనే చిన్నారి చేసిన సాహసాన్నీ ఈ పాఠ్యాంశంతో గుర్తు చేశారు.
వరంగల్‌లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ మెమోరియల్ స్టేడియం (జేఎన్‌ఎం)లో తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా ఇది.
రాజస్థాన్‌లోని ఝాలావార్ జిల్లాలో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రాథమిక పాఠశాలలో పైకప్పు ఆకస్మాత్తుగా కూలిపోవడంతో నలుగురు పిల్లలు దుర్మరణం చెందారు. ఇంకా 60 మందికి పైగా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం.
కలుషిత ఆహారం తిని 11 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డిలోని నాగల్‌గిద్ద మండలం మోర్గి మోడల్ స్కూల్‌లో జరిగింది.
హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నలుగురు వెళ్లాల్సిన ఆటోలో 8 నుంచి 10 మంది.. 8 మందిని తీసుకెళ్లాల్సిన మారుతీ ఓమ్ని వ్యాన్‌లో 15 నుంచి 18 మంది..
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 45 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా తమ పిల్లల బాగోగులు తెలుసుకునేందుకు వసతి గృహానికి వచ్చిన తల్లిదండ్రులు భోజనంలో పురుగులు చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.