Road Accident: వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు.. అమాంతం గాల్లోకి ఎగిరి
ABN , Publish Date - Dec 15 , 2025 | 09:45 AM
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది.
మెదక్, డిసెంబర్ 15: ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పకీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా అనేక కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తమ తప్పేమి లేకున్నా కూడా ఎదుటి వారి నిర్లక్ష్యం కారణంగా బలి అవుతున్న వారు ఎందరో. తాజాగా మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎప్పటిలాగే ఉదయం పనికి బయలుదేరిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే..
జిల్లాలోని కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో ఈరోజు (సోమవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. కారు బలంగా ఢీకొనడంతో సదరు వ్యక్తి అమాంతం గాల్లోకి ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్ గండి మైసమ్మకు చెందిన శ్రీధర్‌గా గుర్తించారు. చిన్న ఘనాపూర్ లోని ఐఎంఎల్ డిపోలో శ్రీధర్ హమాలిగా పనిచేస్తున్నాడు. ఈరోజు ఉదయం శ్రీధర్ పనికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కారు ఢీకొట్టింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లో మరో హత్య.. భయాందోళనలో ప్రజలు
Read Latest Telangana News And Telugu News