Share News

Andela Sriramulu Yadav: బీజేపీ నేత ఇంటి ముందు రోహింగ్యాల రెక్కీ

ABN , Publish Date - Jul 04 , 2025 | 01:28 PM

మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఇంటి ముందు శుక్రవారం రోహింగ్యాలు రెక్కీ నిర్వహించారు. అందెల శ్రీరాములు ఇంటి ముందు అనుమానా స్పదంగా తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు, నేతలు గుర్తించారు.

Andela Sriramulu Yadav: బీజేపీ నేత ఇంటి ముందు రోహింగ్యాల రెక్కీ
Andela Sriramulu Yadav House

రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ (Andela Sriramulu Yadav) ఇంటి ముందు ఇవాళ(శుక్రవారం) రోహింగ్యాలు రెక్కీ నిర్వహించారు. శ్రీరాములు ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు, నేతలు గుర్తించారు. వారి వద్ద పెట్రోల్ బాటిల్, సుత్తి, కట్టర్, ఐరన్ రాడ్స్, బాక్స్‌లో పెట్టుకుని రోహింగ్యాలు తిరుగుతున్నారు.


గత కొన్ని రోజులుగా రోహింగ్యాలపై శ్రీరాములు ఉద్యమం చేస్తున్నారు. అందెల శ్రీరాములకు ప్రాణహాని ఉందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు రోహింగ్యాలను పట్టుకోడానికి ప్రయత్నించగా బండి వదిలి పారిపోయారు. ఐదుగురు వ్యక్తులను గుర్తించి మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పోలీసులకు బీజేపీ నేతలు సమాచారం ఇచ్చారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని మీర్‌పేట పోలీసులు విచారిస్తున్నారు. రోహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ మాగంటి కుటుంబానికే..

కాటేదాన్‌ రబ్బర్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 04 , 2025 | 01:35 PM