Share News

phone tapping case twist: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్

ABN , Publish Date - Mar 07 , 2025 | 02:56 PM

phone tapping case twist: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులకు త్వరలోనే రెడ్‌ కార్నిర్ నోటీసులు జారీ చేయనుంది సీఐడీ.

phone tapping case twist: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్
phone tapping case twist:

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణలో (Telangana) సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కీలక నిందితులుగా ఉన్న మాజీ ఎస్‌ఐబీ చీఫ్‌గా పని చేసిన ప్రభాకర్‌ రావు, ఒక మీడియా సంస్థ అధినేత శ్రవణ్‌ కుమార్ అమెరికా నుంచి మరో దేశానికి వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడానికి కావల్సిన ప్రక్రియను సీఐడీ పూర్తి చేసి సీబీఐకి అందజేసింది. త్వరలోనే సీబీఐ రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వనుంది. రెడ్ కార్నర్ నోటీస్ సీబీఐ ఇవ్వగానే ఏ దేశంలో ఉన్న దొరికిపోతారని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ పోలీసులు పంపిన రెడ్ కార్నర్ నోటీస్ వినతిని సీబీఐకి సీఐడీ పంపించింది.


కాగా.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్‌ రావు, శ్రవణ్‌ కుమార్ అమెరికాలో తలదాచుకున్న విషయం తెలిసిందే. వీరిని విచారణ జరిపితే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అసలు వాస్తవాలు బయటపడతాయని హైదరాబాద్ పోలీసులు భావించారు. అయితే వారిని అమెరికా నుంచి హైదరాబాద్ రప్పించేందుకు.. అలాగే వీరిద్దరినీ తమకు అప్పగించాలని ఇప్పటికే సీబీఐకి సీఐడీ అధికారులు లేఖ రాశారు. సీబీఐకు కావాల్సిన సమాచారాన్ని అందజేశారు. సీబీఐ రెడ్‌ కార్నర్ నోటీసు ఇచ్చిన తర్వాత అమెరికాలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకోవాలనే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు ప్రభాకర్‌ రావు, శ్రవణ్ రావు అమెరికా నుంచి వేరొక దేశానికి పారిపోయారని సమాచారం ఉంది. దీంతో హైదరాబాద్ పోలీసులు, సీఐడీ అధికారులు దీనిపై దృష్టి సారించారు. సీబీఐకి మరో లేఖను రాసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చేందుకు ఇప్పటికే ప్రక్రియ అంతా పూర్తి అయ్యింది. హైదరాబాద్ పోలీసులు సీఐడీకి సమాచారం ఇస్తే.. ఆ ప్రక్రియను పూర్తి చేసిన సీఐడీ.. దాన్ని సీబీఐకి అందజేసింది. రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చే అధికారం సీబీఐకి ఉన్న నేపథ్యంలో ఈ వారంలోనే రెడ్‌ కార్నర్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తే నిందితులు ఏ దేశంలో ఉన్నా కూడా వారిని కస్టడీలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది.

Minister Lokesh:విశ్రాంతి తీసుకుంటారా.. లేక సస్పెండ్ చేయించమంటారా..


గత కొంతకాలంగా ఫోన్‌ ట్యాపింగ్ కేసు విచారణ ముందుకు సాగని పరిస్థితి. ఈ కేసులో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ ప్రణీత్ రావు, టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా పనిచేసిన రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకుని విచారణ జరిపి వారిని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. కొద్దిరోజుల క్రితమే వీరంతా కూడా బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్‌ను విచారిస్తే ఇందులో రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే వీరిద్దరూ కూడా అమెరికాకు పారిపోయారు. ఇప్పుడు అమెరికా నుంచి మరోదేశానికి పారిపోయారనే సమాచారం హైదరాబాద్ పోలీసులకు అందింది. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చాక ఏ దేశంలో ఉన్నా కూడా వీరిద్దరినీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి...

CBI: వివేకా వాచ్‌మన్‌ రంగయ్య మృతిపై కేసు నమోదు

Teacher Beats Students: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బయటపడ్డ పీఈటీ అరాచకం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 07 , 2025 | 03:11 PM