Share News

Shivashakti Datta: సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం

ABN , Publish Date - Jul 08 , 2025 | 08:59 AM

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా సోమవారం రాత్రి కన్నుమూశారు. విజయేంద్రప్రసాద్‌కు సోదరుడు అయిన శివశక్తి పలు సినిమాలకు రైటర్‌గా వర్క్ చేశారు.

Shivashakti Datta: సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
Shivashakti Datta Passes Away

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి (Keeravani) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా (92) (Shivashakti Datta) నిన్న (సోమవారం) రాత్రి మణికొండలోని నివాసంలో కన్నుమూశారు. శివశక్తి పలు సినిమాలకు రైటర్‌గా వర్క్ చేశారు. శివశక్తి దత్తా మృతిచెందడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన కుటుంబ సభ్యులని తెలుగు చిత్ర ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శివశక్తి దత్తాకి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి శివశక్తి దత్తా విశేష సేవలు అందించారని పలువురు కొనియాడుతున్నారు.


శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబర్ 8వ తేదీన రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరులో ఆయన జన్మించారు. శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం.. వారిలో కీరవాణి, కల్యాణి మాలిక్, శివ శ్రీ కంచి ఉన్నారు. ఆయనకు అన్న, అక్క, నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. శివశక్తి తమ్ముడు ప్రముఖ సినీ రచయిత విజయంద్ర ప్రసాద్. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, గాయని, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖకు శివశక్తి దత్తా పెద్దనాన్న అవుతారు. ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో శివశక్తి దత్తా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిపై దాడులకు అవకాశం!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 08 , 2025 | 12:17 PM