Share News

Sabitha Indrarreddy illness: ఎమ్మెల్యే సబితకు అనారోగ్యం

ABN , Publish Date - Mar 08 , 2025 | 09:32 AM

Sabitha Indrarreddy illness: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. నిన్న కేసీఆర్ నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలోనే సబిత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

Sabitha Indrarreddy illness: ఎమ్మెల్యే సబితకు అనారోగ్యం
Sabitha Indrarreddy illness

సిద్దిపేట, మార్చి 8: మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Indra Reddy) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. కొద్దిసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు సబిత. కాగా.. నిన్న (శుక్రవారం) సిద్ధిపేట జిల్లాలో ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (Fomer CM KCR).. పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సమయంలోనే సబిత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం లంచ్ తర్వాత జరిగిన రెండో విడత సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే ఆమె వెళ్లిపోయారు.


తిరుగు ప్రయాణంలో అస్వస్థతకు గురైన సబితను వెంటనే బీఆర్‌ఎస్ శ్రేణులు (BRS) దగ్గర్లోని ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. వెంటనే అడ్మిట్ చేసుకున్న వైద్యులు.. ఆమె డైజెషన్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆపై సబితకు చికిత్స అందజేశారు. రాత్రి ప్రథమ చికిత్స అనంతరం కొద్దిసేపు అబ్జర్వేషన్‌లో ఉంచారు వైద్యులు. తరువాత అర్థరాత్రి 12 గంటల సమయంలో ఆరోగ్యం కాస్త మెరుగవడంతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. విషయం తెలుసుకున్న పార్టీ అధినేత కేసీఆర్.. సబిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే బీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి...

Gold rates today: నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Chandrababu Naidu: మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా ఏపీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 08 , 2025 | 09:34 AM