Share News

Numaish 2025: నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఇలా వెళ్తున్నారా.. మీరు ఇరుక్కున్నట్లే..

ABN , Publish Date - Jan 03 , 2025 | 07:46 AM

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ ఎగ్జిబిషన్‌కు ఎలా వెళ్తే త్వరగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తప్పించుకుని ఎలా వెళ్తే బటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Numaish 2025: నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఇలా వెళ్తున్నారా.. మీరు ఇరుక్కున్నట్లే..
Numaish 2025

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇవాల్టి నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ ప్రారంభమైందంటే హైదరాబాద్ నగర వాసులకు పండగనే చెప్పుకోవాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు ఈ ప్రదర్శనను సందర్శిస్తారు. ఏడాదిలో ఓసారి జరిగే ఈ ఎగ్జిబిషన్‌కు ప్రతి రోజూ వేలల్లో సందర్శకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో వీరి సంఖ్య మరింత ఎక్కువుగా ఉంటుంది. విందు, వినోదాలతో పాటు దుస్తులు, గృహోపకరణాలతో సహా అన్ని రకాల వస్తువులు ఈ ఎగ్జిబిషన్‌లో లభిస్తాయి. ఈ ఎగ్జిబిషన్ జరిగే రోజుల్లో నాంపల్లి, అసెంబ్లీ, గాంధీ భవన్ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువుగా ఉంటుంది. ఇటువైపుగా సాయంకాలం సమయాల్లో వెళ్తే భారీ ట్రాఫిక్‌లో ఇరుక్కోవల్సి వస్తుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకోవడానికి మెట్రో రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. మెట్రో రైలులో వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకోవచ్చు. బస్సు లేదా ఇతర ప్రయివేట్ లేదా సొంత వాహనాల్లో వెళ్తే ట్రాఫిక్ కారణంగా రాకపోకల కోసం ఎక్కువ సమయం వృధా అయ్యే అవకాశం ఉంటుంది.


ప్రయాణం కోసమే ఎక్కువ సమయం వెచ్చించడంతో విసుగు చెంది ఎగ్జిబిషన్‌లో తిరిగేందుకు, ఎక్కువ సమయం గడిపేందుకు వీలుపడకపోవచ్చు. దీంతో ఎగ్జిబిషన్‌ను ఎంజాయ్ చేసే అవకాశాన్ని కోల్పోవచ్చు. సొంత వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటుచేసినప్పటికీ భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో సొంత వాహనాలు, బస్సుల ద్వారా నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వెళ్తే మార్గ మధ్యలో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. నాంపల్లిలో ఈరోజు ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్ ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగనుంది.


నగరంలో ప్రధాన ప్రాంతాల నుంచి..

హైదరాబాద్‌లో ముఖ్యమైన ప్రాంతాల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకునేందుకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. గాంధీ భవన్ మెట్రో స్టేషన్‌లో దిగి అక్కడినుంచి నడక మార్గంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకోవచ్చు. సాధారణంగా నాంపల్లిలో మెట్రో స్టేషన్ ఉన్నప్పటికీ.. అక్కడి నుంచి ఎగ్జిబిషన్ ప్రాంతానికి కొంచెం దూరం ఉండటంతో గాంధీ భవన్ మెట్రో స్టేషన్‌లో దిగడం బెటర్. ఎల్బీనగర్, మియాపూర్ ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్‌కు వచ్చేవారు డైరెక్ట్‌గా గాంధీ భవన్ మెట్రో స్టేషన్‌లో దిగవచ్చు. ఎల్బీనగర్- మియాపూర్ డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంది. రాయదుర్గం, హైటెక్‌సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్ లేదా నాగోల్, సికింద్రాబాద్, బేగంపేట ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి ఎల్బీ నగర్ వెళ్లే రైలు ఎక్కి గాంధీ భవన్‌ మెట్రో స్టేషన్‌లో దిగవచ్చు. మెట్రోలో ప్రయాణించడం ద్వారా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎగ్జిబిషన్‌ను సందర్శించవచ్చు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 03 , 2025 | 07:46 AM