Manuguru News: మణుగూరులో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:26 AM
మణుగూరు తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించింది.
భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో మణుగూరులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తమ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించి బీఆర్ఎస్ కార్యాలయంగా.. చేసుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
మణుగూరు తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి చేశారంటూ మండిపడింది. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ కాంగ్రెస్ వచ్చాక దాడుల విష సంస్కృతిని ప్రోత్సహిస్తుందని ధ్వజమెత్తారు. అయితే ఈ దాడిలో చాలా మంది గాయాలపాలైనట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
PM Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి
Indias Heaviest Communication Satellite: ఇస్రో భారీ ప్రయోగం