Share News

Deadline: మొబైల్, ల్యాప్ టాప్ సమర్పించడానికి కేటీఆర్‌కు డెడ్ లైన్

ABN , Publish Date - Jun 18 , 2025 | 09:03 AM

Formula E scam: కేటీఆర్, ఐఏఎస్ సీనియర్ అధికారి అరవింద్ కుమార్‌ ఉమ్మడి విచారణకు ఏసీబీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అరవింద్ విదేశాల నుంచి వచ్చిన తరువాత ఆయనకు నోటీసులు ఇచ్చి వారం రోజులలోపు ఇద్దరిని కలిపి విచారణ చేసేలా ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Deadline: మొబైల్, ల్యాప్ టాప్ సమర్పించడానికి కేటీఆర్‌కు డెడ్ లైన్
KTR

Hyderabad: ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E Scam Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ (KTR) మొబైల్ (Mobile), ల్యాప్ టాప్ (Laptop) సమర్పించడానికి ఏసీబీ (ACB) అధికారులు డెడ్ లైన్ (Deadline) విధించారు. బుధవారం సాయంత్రంలోపు మొబైల్, ల్యాప్ టాప్ తమకు అందజేయలని ఆదేశించారు. అయితే మొబైల్ ల్యాప్ టాప్ ఏసీబీకి అందజేయడంపై కేటీఆర్ తన న్యాయవాదులతో లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు.ఎలక్ట్రానిక్ వస్తువులు ఏసీబీకి ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయవాదులు చెప్పారు. దీంతో మొబైల్, ల్యాప్ టాప్ అందజేయడానికి కేటీఆర్ నిరాకరిస్తున్నట్లు సమాచారం.


కేటీఆర్, అరవింద్ ఉమ్మడి విచారణకు కసరత్తు..

మరోవైపు కేటీఆర్, ఐఏఎస్ సీనియర్ అధికారి అరవింద్ కుమార్‌ ఉమ్మడి విచారణకు ఏసీబీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అరవింద్ విదేశాల నుంచి వచ్చిన తరువాత ఆయనకు నోటీసులు ఇచ్చి వారం రోజులలోపు ఇద్దరిని కలిపి విచారణ చేసేలా ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటికే అరవింద్ కుమార్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. యూరప్‌లో ఉన్న అరవింద్ ఈ నెల 21న హైదరాబాద్‌కు వస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు ఎఫ్ఈవో (FEO) కంపెనీకి బదిలీ చేశామని అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.


కేటీఆర్‌ తన వాట్సాప్‌ ద్వారా...

ఫార్ములా-ఈ కార్ల రేసు వ్యవహారంలో, ముఖ్యంగా రేసు నిర్వహణ సంస్థ ఎఫ్‌ఈవో (ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌)కు నిధుల జారీకి సంబంధించి కేటీఆర్‌ తన వాట్సాప్‌ ద్వారా అరవింద్‌కుమార్‌కు ఆదేశాలు ఇచ్చారనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. హెచ్‌ఎండీఎ ఖాతాల నుంచి ఎఫ్‌ఈఓకు నిధులు బదిలీ చేసే ముందు తనకు, కేటీఆర్‌కు మధ్య జరిగిన వాట్సాప్‌ సంభాషణల విషయమై ఏసీబీ విచారణ సందర్భంగా అరవింద్‌ కుమార్‌ వివరించినట్టు సమాచారం. దీనితో ఆ సమయంలో ఉపయోగించిన సెల్‌ఫోన్లు, ల్యాప్‌ టాప్‌ను తమకు అప్పగించాలని కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ఆదేశించినట్టు తెలిసింది. మరోవైపు ఈ కేసులో ఏ2 నిందితుడైన ఐఏఎస్‌ అధికారి అరవింద్‌కుమార్‌ వ్యక్తిగత సెలవుపై విదేశాలకు వెళ్లడంపై సీఎంకు ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అరవింద్‌ కుమార్‌ సెలవు రద్దు చేసుకుని, వెంటనే వెనక్కి రావాలని సీఎస్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి:

మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్ కౌంటర్

చిన్నారి ప్రాణం తీసిన బీడీ ముక్క..

ఎంఐటీ అధిపతిగా చంద్రకాసన్‌

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 18 , 2025 | 09:26 AM